Varun Gandhi: బీజేపీ నేత వరుణ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతోంది. తమ పార్టీలో చేరాలని సూచిస్తోంది. ఇటీవల బీజేపీ లోక్సభ అభ్యర్థుల 5వ జాబితాలో వరుణ్ గాంధీని తప్పించింది.
కచ్చితంగా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన సంగారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో మెదక్ నుంచి పోటీ చేద్దామని సర్వేలు చేసుకుని BRS గెలుస్తుందని తెలిసి వెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి రఘునందన్ పనిమంతుడు అయితే దుబ్బాకలో గెలిచేవాడు కదా అని ఆయన సెటైర్లు వేశారు. ముస్లింలకు కాంగ్రెస్ కేబినెట్లో మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ఆయన…
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై హాట్ కామెంట్స్ చేశారు. దేశం ప్రశాంతంగా ఉండాలంటే మోడీ తిరిగి అధికారంలోకి రావొద్దని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశమంతా అల్లర్లతో అల్లకల్లోలంగా మారుతుందని ఓట్లర్లను ఆయన హెచ్చరించారు.
ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ఐకమత్యంతో అందరం కలిసికట్టుగా పనిచేసి ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా వేగర వేద్దాం అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మనందరి జీవితాలు మారుతాయి అన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధ్వర్యంలో సోమవారం నాడు సాయంత్రం గన్నవరంలోని రోటరీ క్లబ్ హాల్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గన్నవరం నియోజకవర్గ నలువైపుల నుంచి మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.