పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలనకు చరమ గీతం పాడాలి అని పేర్కొన్నారు. విధ్వంసకర పాలన నుండి ప్రజలను విముక్తి చేయాలి.. ఎన్నికల సమయంలో పని చేసే విషయాలపై క్షేత్ర స్థాయిలో వివరించడంతో పాటు కార్యకర్తలతో కలిసి దిశా నిర్దేశం చేయాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం అయింది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల ఆలోచనలు తీసుకుంటాం అని ఆమె తెలిపారు. పొత్తులో మూడు పార్టీలు ఉన్నా ఎజెండా ఒక్కటే.. అప్పుల ఊబిలోకి నెట్టేసి నా వైసీపీ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారు అని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మండిపడ్డారు.
Read Also: K. Laxman: అవినీతి పరులను జైల్లో వేస్తామన్నారు.. సీఎం మాటలకే పరిమితమా..?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో సుపరిపాలన అందిస్తున్నారు అని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. దేశంలో అవినీతి రహిత పాలన ఇస్తున్నారు.. నరేంద్ర మోడీ పాలనలో 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య బాలరాముడు విగ్రహం ప్రాణ ప్రతిష్టతో పాటు పేదవాడి జీవితానికి భరోసా నరేంద్ర మోడీ కల్పించారు.. అలాగే, దేశంలో పేదరికం తగ్గుతుంది అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైసీపీ పాలనను అంతం చేసేందుకు టీడీపీ- జనసేనతో బీజేపీ కలిసిందని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం సాధించి.. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దికి పూనాది వేస్తామని చెప్పుకొచ్చారు. కేంద్రంలో మరోసారి మోడీ సర్కార్ ఏర్పాడుందన్నారు.