BJP: రాహుల్ గాంధీ కన్నా అడవి ఏనుగులే వయనాడ్‌కి ఎక్కువ సార్లు వచ్చాయి.. బీజేపీ అభ్యర్థి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కేరళ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ అభ్యర్థి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న కే. సురేంద్రన్, రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలకు దిగారు. అటవీ ఏనుగుల దాడులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో..‘‘ వయనాడ్‌లో అటవీ ఏనుగు దాడి చేయడం వల్ల మరొకరు చనిపోయారు. మినీ ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కేరళలో ముఖ్యంగా వయనాడ్‌లో మనుషులు-వన్యప్రాణుల మధ్య ఘర్షణ పీడకలగా మారింది’’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Read Also: K Padmarajan: “గెలుపెరగని యోధుడు”.. 238 సార్లు ఓడినా మళ్లీ ఎన్నికలకు సిద్ధం..
Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
రాహుల్ గాంధీ వయనాడ్‌కి వచ్చిన దాని కన్నా అటవీ ఏనుగులు ఎక్కువగా ఈ ప్రాంతానికి వస్తున్నాయని సురేంద్రన్ విమర్శించారు. వయనాడ్ ప్రాంతంలో ఇటీవల కాలంలో మనుషులు-వన్యప్రాణుల సంఘర్షణలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంక్షోభాన్ని నివారించడంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు కేరళ సీఎం పనరయి విజయన్ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ వయనాడ్‌కి తరుచుగా వెళ్లడంపై అధికార సీపీఎంతో పాటు బీజేపీ తీవ్రంగా విమర్శి్స్తోంది. ఈ ప్రాంతంలో ఏనుగుల దాడిపై ఆయన స్పందించకపోవడంపై అక్కడి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి ఓట్లపైనే ఆసక్తి ఉందా..? అతను వయనాడ్‌కి వచ్చిన దాని కన్నా అటవీ ఏనుగులే పట్టణానికి ఎక్కువగా వచ్చాయని అన్నారు. అతడు ప్రజల ప్రాణాలపై ఉదాసీనంగా ఉన్నాడు, ప్రజలు కష్టాల్లో ఉంటే పాలుపంచుకోకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి ఆనందిస్తాడని, రాహుల్ గాంధీ ఈ నిర్లక్ష్యానికి సమాధానం చెప్పే సమయం వచ్చిందని సురేంద్రన్ అన్నారు.
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!