Kakarla Suresh: వింజమూరు ప్రజాగళం అదరాలి.. వైసీపీ బెదరాలి.. టీడీపీ జెండా ఎగరాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakarla Suresh: అవినీతి పాలనను అంతమొందించి సుపరిపాలన కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ప్రజా గళం సభను విజయవంతం చేయాలని ఉదయగిరి కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ నెల 29న వింజమూరులో నిర్వహించనున్న ప్రజాగళం సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కావలిలో సభ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు వింజమూరు ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్దకు చేరుకుంటారని.. అక్కడ ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడతారని తెలిపారు.
ఎనిమిది మండలాల నుంచి వచ్చే నాయకులు కార్యకర్తలు ప్రజానీకానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాల కోసం పార్కింగ్ స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. సుమారు 500 మంది టీడీపీ వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వారికి సహకరించాలని కోరారు. అదేవిధంగా సభ అనంతరం అందరికీ భోజన వసతి కల్పించడం జరిగిందని, ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలో భోజన సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. కనుక ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా సహకరించాలన్నారు. ప్రజాగళం సభ వింజమూరులో అదరాలని, ఈ దెబ్బకు వైసీపీ బెదరాలని, ఉదయగిరి కోటపై టీడీపీ జెండా ఎగరాలని ఈ ప్రాంత ప్రజల కల నెరవేరాలని కాకర్ల సురేష్ ఆకాంక్షించారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగం, అన్ని శాఖల అధికారులకు ప్రజానీకం సహకరించి సభను విజయవంతం చేయాలని కోరారు.
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
అనంతరం మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ చంచల బాబు యాదవ్ మాట్లాడుతూ.. రాజారెడ్డి రాజ్యాంగం పోవాలి, అంబేద్కర్ రాజ్యాంగం రావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా తయారైందన్నారు. మద్యం, ఇసుక, మైనింగ్, డ్రగ్స్ , వ్యాపారాలు చేసి వేలకోట్లు అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పరిశీలకులు వికాస్ హరికృష్ణ, కాకర్ల వెంకట్, మాజీ ఏఎంసీ ఛైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి యారం కృష్ణయ్య, ఉదయగిరి మండల కన్వీనర్ బయన్న, కలిగిరి మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కాకు మహేష్, ఉదయగిరి మాజీ సర్పంచ్ షేక్ రియాజ్, చీమల తాతయ్య, తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!