శ్రీకాకుళం: ఏపీకి డ్రైవర్ తానేనని.. నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలనే ఉద్దేశంతోనే పోరాటం చేస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇబ్బందుల పాలైన ప్రజల కోసమే బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా వస్తున్నట్లు తెలిపారు. పోరాటం చేయడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చరన్నారు. మోదీ మూడో సారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మ్యానిఫెస్టోతో టీడీపీ సూపర్ సిక్స్ లతో జనాల రాత మారుతుందన్నారు. రాజాంలో పూర్వ వైభవం రావాలన్నది తన చివరి కోరికన్నారు.
Read Also: Rajaiah: కడియం శ్రీహరి కుల వారసత్వం మీద అనుమానాలు ఉన్నాయి..
సైకిల్ ఎక్కండి.. జనసేన జెండా పట్టండి.. కమలం పువ్వు సైకిల్ పై ఉంచండని పిలుపునిచ్చారు. యువతకు ఉపాధి కల్పించడంతో పాటు భోగాపురం ఎయిపోర్టును సంవత్సరంలోపు పూర్తి చేస్తామన్నారు. ఆడబిడ్డలకు రూ. 1500 లతో పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం సహకారంతో ఆడబిడ్డలను లక్షాదికారులుగా చేసే బాధ్యత తమదన్నారు. అన్నదాత రూ. 25 వేలు ఇచ్చి రైతును రాజు చేస్తానన్నారు. పేదలకు రూ. 4 వేల రూపాయలు పింఛన్ ఏప్రిల్ నుండే అమలు చేసి.. జులై నెలలో మూడు నెలల బకాయిలు చెల్లిస్తామని చెప్పారు.
Read Also: Mamata Banerjee: బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలు ఉండవు..
వెనుబడిన వారికి 50 సంవత్సరాలకే పింఛను అందేలా చేస్తామన్నారు. కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోందని గుర్తు చేశారు. వాలంటీర్లు 5 వేల నుండి 10 వేల వరకూ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ రోడ్డును అందంగా చేస్తానని, రింగు రోడ్డు, మూత పడిన పరిశ్రమలు తెరిపిస్తానన్నారు. టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తానని పేదలకు రెండు సెంట్ల జాగా ఇచ్చి కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా తానూ సాయం చేస్తానన్నారు. జగన్ ఇచ్చే ఇళ్లును కూడా కట్టిస్తానని చెప్పారు.