వైసీపీ అధినేత జగన్ గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న వేళ ఆ పార్టీకి వైసీపీ నాయకులు ఝలక్ ఇచ్చారు. గన్నవరం మండలం కొండపావులూరు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ కన్వీనర్ కంచర్ల లక్ష్మణ్ రావు(పండు), వార్డు సభ్యులు గజగంటి వేణు.. వైసీపీని వీడి గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో సోమవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి జనాధరణ పెరుగుతుందన్నారు. నియోజకవర్గంలో పసుపు జెండాకు తప్ప మిగతా పార్టీలకు చోటు లేదని తెలిపారు. గన్నవరంలో టీడీపీ జెండా ఎగురుతుందని, రాష్ట్రంలో ఏర్పడేది ఎన్డీయే ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని యార్లగడ్డ చెప్పారు.
ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు అట్లూరి రామకిరణ్ ఆధ్వర్యంలో.. ఆత్కూరుకు చెందిన వైసీపీ నాయకులు సోమవారం టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఆర్. తిరుపతి, హెచ్ వాసు, పి. గడ్డియ్యా, పి. యశ్వంత్, జి. దుర్గాప్రసాద్, బి. తేజ, షేక్ పతీష్, ఎం. నాగసాయి, జె. జీవన్ బాబు, ఎస్కే రంగ, జి. వినయ్ కుమార్, డి. గౌరినాయుడు, మూలుపూరి నాని, మలాది సుధీర్లకు గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Salman Khan: కాల్పుల అనంతరం మొదటిసారి బయటకొచ్చిన సల్మాన్ ఖాన్
యార్లగడ్డకు మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు…
మందకృష్ణ మాదిగ సూచన మేరకు గన్నవరం నియోజకవర్గ ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుని సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఎన్డీయే ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో యార్లగడ్డ గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు మద్దతు తెలపటం సంతోషంగా ఉందన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో చేపట్టే అన్ని కార్యక్రమాల్లో మాదిగలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో మాదిగ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డప్పు కళాకారులకు, ఇతర వృత్తుల వారికి పింఛన్లు అందజేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తన గెలుపునకు కృషి చేయాలని కోరారు. యార్లగడ్డని కలిసిన వారిలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నియోజకవర్గ నాయకులు మంద వేణుబాబు మాదిగ, చోడవరపు వెంకటేశ్వరరావు మాదిగ, సిర్ర అశోక్ కుమార్ మాదిగ, చేదుర్తిపాటి రమేష్ బాబు, పులపాక కుమార్, వంగూరి మరియదాసు, నందేటి తిరుపతిరావు, కోట బాబురావు, రెడ్డి గోపాల్ రావు తదితరులు ఉన్నారు…
Kakarla Suresh: కాకర్ల సురేష్కు మద్దతుగా ప్రచారం చేసిన కుటుంబ సభ్యులు..
ఎన్డీయే ప్రభుత్వంలో ముదిరాజ్ లకు సముచిత స్థానం కల్పిస్తాం: యార్లగడ్డ
ఎన్డీయే ప్రభుత్వంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పిస్తామని గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. అందరూ ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. గన్నవరంలోని రోటరీ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో యార్లగడ్డ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా, అన్ని వర్గాల ప్రజలకు సరైన గౌరవం దక్కాలన్నా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని, వైసీపీ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
నియోజకవర్గంలో ముదిరాజ్ కుల సంఘ కళ్యాణ మండపం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. తాగు, సాగు నీటి సమస్యలు తీర్చుతానని, స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. అర్హులైన 15 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తానని చెప్పారు. తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేయడంతో పాటు గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి బాలశౌరిని ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రామవరప్పాడు గ్రామంలోని విజయవాడ రూరల్ మండల జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన పార్టీ చేరికల కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలిసి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.