Nitish Kumar: నోరుజారిన నితీష్ కుమార్.. “మోడీ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ నోరు జారారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అనుకోకుండా ప్రధాని నరేంద్రమోడీ మళ్లీ ‘ముఖ్యమంత్రి’ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పాట్నాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ మేము భారత్ అంతటా 400 సీట్లకు పై గెలవాలని అనుకుంటున్నాము. నరేంద్ర మోడీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి, అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది, బీహార్ అభివృద్ధి చెందుతుంది, ప్రతిదీ జరుగుతుంది’’ అని అన్నారు.
Read Also: Rajnath Singh: ‘‘వర్క్ ఫ్రం హోమ్’’ విన్నా, కానీ తొలిసారి ‘‘వర్క్ ఫ్రం జైల్’’ వింటున్నా..
Also Read
అయితే, ఈ వ్యాఖ్యలపై వెంటనే సర్దుకుని, నరేంద్రమోడీ మళ్లీ ప్రధాని అవుతారని అన్నారు. ‘‘నరేంద్రమోడీ ప్రధానిగా ఉన్నారు. ఇలాగే ముందుకు సాగుతారు. అనే నాకు కావాలి’’అని నితీష్ కుమార్ అన్నారు. ఇటీవల పలు సందర్భాల్లో నితీష్ కుమార్ నోరుజారారు. ఇటీవల 2020లో మరణించిన రామ్ విలాస్ పాశ్వాన్‌కి ఓట్లు వేయాలని కోరారు.
బీహార్‌లోని 40 స్థానాల్లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. 2019లో ఈ కూటమి ఏకంగా 39 స్థానాలను కైవసం చేసుకుంది. మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని ఎన్డీయే భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్-ఆర్జేడీ-లెఫ్ట్ పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.
पटना के जनसभा में मुख्यमंत्री जी ने साफ़ साफ़ बता दिया कि नरेंद्र मोदी मुख्यमंत्री बने।
इशारा साफ़ है। गुजरातियों को गुजरात भेजना है। जय हो। #nitishKumar #FCKB04pic.twitter.com/pLoywh8D1Q
— संजीत कुमार (यदुवंशी) (@iamsanjeetyadav) May 26, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!