Amit Shah: ఏపీ, ఒడిశాలో గెలవబోతున్నాము.. అమిత్ షా ధీమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: లోక్‌సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. జూన్ 1న చివరిదైన ఏడో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడబోతున్నాయి. ఎంపీ ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల తో పాటు మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, అలాగే మిత్రపక్షం చంద్రబాబు నాయుడితో కలిసి ఏపీలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తప్పకుండా 400 సీట్లను దాటుతుందని, ఒడిశా, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా చెప్పారు.ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాల్లో బీజేపీ మంచి పనితీరు కనబరుస్తుందని, ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పనితీరే కారణమని ఆయన అన్నారు.
Also Read
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
Read Also: Cyclone Remal: తీవ్ర తుఫానుగా మారిన ‘రెమల్’.. బంగ్లాదేశ్, బెంగాల్ తీరాన్ని తాకనున్న తుఫాన్
147 స్థానాలు ఉన్న ఒడిశా అసెంబ్లీలో 75 సీట్లు, రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాల్లో 16-17 సీట్లు గెలుచుకుంటామని బీజేపీ అంచనా వేస్తోంది. బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలకు గానూ ఈ సారి 24-30 మధ్య సీట్లు సాధిస్తామని చెబుతోంది. ఏపీలో 25 ఎంపీ స్థానాలకు దాదాపుగా 17 ఎన్డీయే కూటమి ఖాతాలో పడతాయని ధీమా వ్యక్తం చేస్తోంది.
అవినీతి, గోవులు-బొగ్గు అక్రమ రవాణా, చొరబాట్లపై ప్రజలు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారని అమిత్ షా అన్నారు. సందేశ్‌ఖాలీ వివాదం, మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల ఫలితమే అని చెప్పారు. తమిళనాడులో బీజేపీ గట్టిపోటీ ఇచ్చిందని, మాకు ఆ రాష్ట్రంలో కొత్త టీం ఉందని, ఆ రాష్ట్రంలో బీజేపీ సీట్లు, ఓట్లశాతం పెరుగుతుందని, తమిళనాడులో ఖచ్చితంగా బలమైన పునాది వేస్తామని చెప్పారు. కేరళలో పార్టీ ఈ సారి ఖాతా తెరుస్తుందని, మూడు స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Dada : ‘దాదా’ మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
-
KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
-
Asian Games 2026 Badminton: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ.. పీవీ సింధు ఓటమితో పతకాల ఆశలు ఆవిరి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?