Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని నాలుగు స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నిక హిమాచల్‌లోని సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖూ ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించనుంది. ఈ ఎన్నికలతో సుఖూ ప్రభుత్వ విశ్వసనీయత ప్రమాదంలో పడింది. హిమాచల్‌లో సుజన్‌పూర్, ధర్మశాల, లాహౌల్-స్పితి, బుర్సర్, గాగ్రెట్, కుత్లహర్‌లలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తిరుగుబాటు నేతలు రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, దేవిందర్ కుమార్ భుట్టో, చైతన్య శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, రవి ఠాకూర్ బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. దీని వల్ల ఇప్పుడు ఈ సీట్లపై సుఖూ ప్రభుత్వాన్ని నిలబెడుతుందా లేక ప్రభుత్వం ఘోరంగా దెబ్బతింటుందా అనేది చూడాలి మరి.. బీజేపీకి మళ్లీ అధికారం దక్కించుకోవడానికి ఇదే పెద్ద అవకాశం.
Read Also:Manamey : శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ వచ్చేసింది..
తిరుగుబాటు నేతలు బీజేపీలో చేరారు
హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ సెషన్‌లో, పార్టీ విప్‌ను ఉల్లంఘించినందుకు ఆరుగురు తిరుగుబాటుదారులపై కాంగ్రెస్ అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత ఆరు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఎమ్మెల్యేలు ఫిబ్రవరి 29న రాజ్యసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి ఓటు వేశారు. తరువాత ఎమ్మెల్యేలందరూ బిజెపి పార్టీలో చేరారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలంతా బీజేపీ టిక్కెట్‌పై తమ తమ ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేశారు.
Read Also:AP-TG Rains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు..
సుక్కు భవిష్యత్తును తేల్చనున్న ఉప ఎన్నికలు
ఈ ఎన్నికల్లో సీఎం సుక్కు చాలా పడింది. ఈ ఆరు స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు సీఎం సుక్కు రాజకీయ భవిష్యత్తుపై పెను ప్రభావం చూపుతాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన బీజేపీకి, కోల్పోయిన ప్రాబల్యాన్ని తిరిగి పొందేందుకు ఇదే అవకాశం. 2022లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 40 సీట్లు, బీజేపీ 25 సీట్లు, ఇతరులు మూడు సీట్లు గెలుచుకున్నారు. అయితే, 2014 – 2019 సంవత్సరాల్లో, హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలను బిజెపి గెలుచుకుంది.