ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారత దేశం ఈ పది సంవత్సరాలలో ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ప్రధాని స్థానంలో మోడీ ఉంటేనే ప్రపంచంలో తగిన స్థానంలోకి భారత దేశం వస్తుంది.. మోడీ ఆధ్వర్యంలో ఆర్థిక శక్తిగా మూడో స్థానంలోకి భారత్ వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 60 వేల కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పేదలకి ఇళ్ల నిర్మాణం, మరుగు దొడ్లు నిర్మాణం చేపట్టారు అని ఆమె గుర్తు చేశారు. బీజేపీ సిద్ధాంతం ఒకటే.. ముందు దేశం ఆ తర్వాత పార్టీ ఆ తరువాతే వ్యక్తి.. అందుకే రాష్ట్ర అధ్యక్షురాలు పదవిలో నేను ఉన్నా.. లేకపోయినా దేశం కోసం బీజేపీ కోసం మనందరం కలిసి కట్టుగా పని చేయాలి అని పురందేశ్వరి పిలుపునిచ్చింది.
Read Also: Mahesh Babu: మిస్ యూ నాన్న.. మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్!
ఇక, బీజేపీలో ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారిని గుర్తించి అందరికి సముచిత స్థానం కల్పిస్తామని పురందేశ్వరి వెల్లడించింది. ముస్లిం మైనారిటీ మహిళలకి సోదర భావంతో మోడీ అండగా నిలిచారు.. మైనారిటీ మహిళలకి కుటుంబ పెద్దగా మోడీ ఒక సహసపేతమైన నిర్ణయం తీసుకున్నారు.. భారత సైనికులపై ఉగ్రవాదులు చేస్తున్న దాడులని ఖండించి సర్జికల్ స్ట్రైక్ చేసిన గొప్ప నాయకుడు ప్రధాని మోడీ అని ఆమె చెప్పుకొచ్చింది. బాల రాముడి నిర్మాణం చేపడితే రక్తసిక్తం అవుతుందని ప్రతిపక్షాలు విమర్శలు చేసాయి.. కానీ రాముడి అశీసులతో ప్రశాంతమైన వాతావరణంలో మోడీ బాల రాముడి మందిరం నిర్మాణం చేపట్టారు.. అయోధ్యలో బాల రాముడి మందిర నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు చేసి మోడీ చరిత్రలో నిలిచారు అని దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు.