Eatala Rajendar: లగచర్ల రైతులు తమ భూములు ఇవ్వమంటున్నా భయపెడుతున్నారు అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. అనేక సంవత్సరాలుగా అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తున్నారు.
రాజ్యాంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నందుర్బార్లో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌గాంధీ మాట్లాడారు.
Kanhaiya Kumar: మహరాష్ట్ర ఎన్నికల్లో విమర్శలు ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ భార్య గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉపముఖ్యమంత్రి భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు ‘‘మతాన్ని రక్షించే’’ బాధ్యత ప్రజలపై ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.
Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం బీజేపీపై పెద్ద ఆరోపణ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ టార్గె్ట్గా కేంద్రమంత్రి నిప్పులు చెరిగారు. ‘‘రాహుల్ బాబా’’ అనే పేరు కలిగిన విమానం ఇప్పటికే 20 సార్లు కూలిపోయిందని, నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత 21వ సారి కూలిపోనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు
Minister Satya Kumar: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మండిపడ్డారు. శాసన మండలిలో నేను నవ్వుతూ సమాధానం చెప్పానని జగన్ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.. చట్ట సభల్లో నవ్వుతూ కాకుండా ఏడుస్తూ సమాధానాలు చెప్తారా అని ప్రశ్నించారు.
Jharkhand Election : జార్ఖండ్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు అంటే బుధవారం ఓటింగ్ జరగనుంది. తొలి దశలో రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు గాను 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, కేటీఆర్ సిరిసిల్ల నేతన్న ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.