Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోంది. ఈ రోజు మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో ఇరు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఎర్లీ ట్రెండ్స్ నుంచి బీజేపీ కూటమి రెండు రాష్ట్రాల్లోనూ లీడింగ్‌లో ఉంది. తాజాగా ఆధిక్యంలో బీజేపీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. మహారాష్ట్రలో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నప్పటికీ.. జార్ఖండ్‌లో ఆధిక్యం బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య చేతులు మారుతోంది.
Read Also: Virender Sehwag: ఆర్యవీర్.. తృటిలో ఫెరీరా కారు మిస్ అయ్యావ్: సెహ్వాగ్
మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉంటే, మ్యాజిక్ ఫిగర్ 145. ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి 156 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని శరద్ పవార్ ఎన్సీపీ, ఠాక్రే శివసేన 97 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 41. ఈ రాష్ట్రంలో ఎన్డీయే, ఇండియా కూటములు హోరాహోరీగా తలబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 38 స్థానాల్లో, కాంగ్రెస్+జేఎంఎం ఇండియా కూటమి 37 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి.