Maharashtra Next CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి సంచలనం సృష్టించింది. ట్రెండ్స్ ప్రకారం బీజేపీ కూటమి 210కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఎవరు దక్కించుకుంటారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. తాజాగా, దీనిపై బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ హాట్ కామెంట్స్ చేశారు. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీయే సీఎం పీఠాన్ని దక్కించుకుంటుందని చెప్పుకొచ్చారు. బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి.. మాకు దాదాపు 125 సీట్లు రాబోతున్నాయి.. ఇక, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని కమలం పార్టీ నేత ప్రవీణ్ దారేకర్ చెప్పుకొచ్చారు.
Read Also: Shiv Sena: బాలాసాహెబ్ ఠాక్రే వారసుడు ‘‘ఏక్‌నాథ్ షిండే’’.. ఉద్ధవ్‌ని మరిచిన మహా ఓటర్లు..
కాగా, ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఒంటరిగా 110 సీట్ల పైగా కైవసం చేసుకోవడంతో.. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిపై వాదన బలంగా వినిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో కమలం అధినేతే సీఎంగా కూర్చునే అవకాశం ఉంది. కాగా, ఏక్ నాథ్ షిండే వర్గం నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీఎం పదవిని వదులుకునే ప్రసక్తే లేదన్న షిండే వర్గం తేల్చి చెప్పింది. దీంతో ముంబైలో ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ కీలక సమావేశం ఏర్పాటు చేయగా.. పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. రాష్ట్ర సీఎం పదవిని ఫడ్నవీస్ చేపట్టాలని బీజేపీ నేతల డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Student Suicide: మియాపూర్ లో విద్యార్థి ఆత్మహత్య.. అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు..
అయితే, 2019లో మహారాష్ట్రలో బీజేపీకి 105, శివసేనకు 56 స్థానాల్లో విజయం సాధించింది. అయితే రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని పంచుకున్న తర్వాత బీజేపీ, శివసేన మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత మహాకూటమి(కాంగ్రెస్+ఎన్సీపీ)తో జత కట్టిన శివసే మహావికాస్ అఘాడిగా ఏర్పడింది. దీంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ అనే మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ఉద్ధవ్ ఠాక్రే రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2022లో షిండే బీజేపీతో జత కట్టడంతో మరోసారి బీజేపీ+ శివసేన(షిండేవర్గం)+ ఎన్సీపీ(పవార్) అధికారంలోకి వచ్చింది. సీఎంగా ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ లు పదవులు తీసుకున్నారు.