BJP: ముస్లిం మత నాయకుడు నోమానీపై ఫిర్యాదు చేసిన బీజేపీ..
- వివాదాస్పత మత నాయకుడు నోమానీపై బీజేపీ ఫిర్యాదు..
- మహారాష్ట్ర ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్‌కి ఓటేయాలని పిలుపు..
- బీజేపీకి సహకరించే ముస్లింలను బహిష్కరించాలని ఫత్వా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివాదాస్పద ఫత్వా జారీ చేసిన ఇస్లామిక్ మత నాయకుడు మౌలానా సజ్జాద్ నోమానీపై బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్-ఉద్ధవ్ ఠాక్రే-శరద్ పవార్ కూటమికి ఓటేయాలని రాష్ట్రంలో ముస్లింలకు పిలుపునివ్వడంపై వీడియో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలో బీజేపీ ఓటమి కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచగలదని తాను నమ్ముతున్నానని నోమని అన్నారు. ఈ వీడియోపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు ఓటమి భయంతో సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది.
Read Also: Bandi Sanjay : ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీ టాక్స్ మినహాయింపు ఇవ్వండి
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ఇదే కాకుండా.. నోమానీ మాట్లాడుతూ.. బీజేపీతో సంబంధం ఉన్న ముస్లింలను బహిష్కరించాలని, ఇస్లాం నుంచి తిరస్కరించాలని ఫత్వాలో పేర్కొన్నాడు. వివాదాస్పద ఫత్వాకు సంబంధించిన వీడియో కూడా విడుదలైంది. బీజేపీకి పనిచేస్తున్న ముస్లింలను విస్మరించాలని చెప్పారు. నోమానీ వ్యాఖ్యలు మహారాష్ట్రలో పాటు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో విషయం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్ధిఖీ ఢిల్లీ పోలీసులను కోరారు. ఈ ప్రకటన వల్ల సమాజంలో చీలికలు ఏర్పడి మత సామరస్యాలు చెలరేగే ప్రమాదం ఉందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
‘‘ మసీదులు, ఇతర ప్రార్థనా స్థలాల వద్ద వారు(ముస్లింలు) ధిక్కారం, బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. మౌలానా ప్రకటనకు ప్రభావితమై, చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అని తనతో పాటు ఇతరులు కూడా బెదిరింపులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నోమానీ తన వివాదాస్పద వ్యాఖ్యల్లో బీజేపీకి పనిచేసే ముస్లింలను ఘనశ్యామ్ అని పిలువాలని కోరారని, అటువంటి ఫత్వా కారణంగా, సమాజంలో విభజన, వారి జీవితాలకు ప్రమాదంతో పాటు మతసామరస్యం దెబ్బతింటుందని సిద్ధిఖీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!