Bandi Sanjay : ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. గోద్రా ఘటనను తప్పుడుగా చిత్రీకరించి చరిత్రను కనుమరుగు చేసేందుకు యత్నించిన కాంగ్రెస్, ఒక సెక్షన్ మీడియా కుట్రలను ఈ సినిమా ద్వారా బట్ట బయలు చేయడం అభినందనీయమన్నారు. ‘‘ది సబర్మతి రిపోర్ట్’’ వంటి అద్బుతమైన సినిమాను అందించిన దర్శక నిర్మాతలకు, సినీ నటీనటులకు ప్రత్యేక అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ జీవీకే మాల్ లో ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను బండి సంజయ్ కుమార్ వీక్షించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధి జె.సంగప్పలతో కలిసి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఏమన్నారంటే…
ది సబర్మతి రిపోర్ట్ అద్బుతమైన సినిమా. ఈ సినిమాను తీసిన దర్శక, నిర్మాత, నటీనటులకు నా హ్యాట్యాఫ్. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. వివాదాల్లేకుండా తీసిన సినిమా. నిజం నిప్పులాంటిది. కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రను వక్రీకరించి అర్ధం పర్ధంలేని విషయాలను జోడించి వాస్తవాలను తెరమరుగు చేసేందుకు యత్నించింది. గోద్రా ఘటనలో కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి మద్దతిచ్చింది. అయోధ్య నుండి వచ్చిన కరసేవకులను హతమార్చాలనే ఉద్దేశంతో ఈ దేశంలో మత విద్వేషాలు స్రుష్టించి రాజకీయ లబ్ది పొదాలని కాంగ్రెస్ చేసిన కుట్రను ఈ సినిమా ద్వారా బహిర్గతం చేశారు.
Kushboo : నేనూ బాధితురాలినే.. కాస్టింగ్ కౌచ్ పై కుష్బూ సంచలన వ్యాఖ్యలు..
గతం నుండి జాతీయవాదులు, బీజేపీ నాయకులు ఇదే విషయం చెబుతూ వచ్చారు. కరసేవకుల హత్యకు చేసిన కుట్రనే గోద్రా ఘటన అని చెప్పినా కాంగ్రెస్ పార్టీ, ఒక సెక్షన్ మీడియా కావాలని ప్రజల ద్రుష్టి మళ్లించింది. కరసేవకులు అయోధ్య నుండి వస్తున్న రైలులో సిలిండర్ పేలిందని, గ్యాస్ స్టవ్ పేలిందని దుష్ప్రచారం చేశారు. ఈ సినిమాతో వాస్తవాలు బయటకు వచ్చాయి. జరిగిన సంఘటనకు కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా ఇది.
నేటికీ సత్యం బయటకు రాకుండా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నిత్యం వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ జరిగితే…. పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ సంబురాలు చేసే వాళ్లున్నారు. ఇండియా గెలవొద్దని కోరే వాళ్లూ ఉన్నారు. చాలాచోట్ల మినీ పాకిస్తాన్, మినీ బంగ్లాదేశ్ వంటి కాలనీలున్నాయంటే ఎవరు మారాలో అర్ధం చేసుకోవాలి. ఇప్పటికైనా సమాజం మారాలి. జరుగుతున్న వాస్తవాలను సమాజం గుర్తించాలి. స్పందించాలి. శక్తవంతమైన సమాజ నిర్మాణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి.
ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని కోరుతున్నా. వాస్తవాలు తెలుసుకోండి. కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ హిందువులను ఏ విధంగా దెబ్బతీయాలని చూస్తున్నాయో అర్ధం చేసుకోండి. దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలంతా ఈ సినిమా చూసి వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నా. అద్బుతమైన ఈ సినిమాకు ఉత్తర ప్రదేశ్ లో ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ది సబర్మతి రిపోర్ట్ సినిమాకు ట్యాక్స్ మినహాయింపు కోరుతున్నా.
చరిత్రను వక్రీకరించి వందల మంది చావుకు, హింసకు కారణమైన కాంగ్రెస్ కుట్రలను ఈ సినిమా ద్వారా బయటపెడితే తప్పేంటి? చరిత్రను తెరమరుగు చేయాలనుకుంటున్న ఈ తరుణంలో వాస్తవాలు బయటకు రావాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీసిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నా. ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని సినిమా ఇండస్ట్రీని కోరుతున్నా.
Game Changer: టాలీవుడ్లో హిస్టరీ.. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్