Telangana BJP : కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఇవ్వనందుకు ఆయనకు ఏకంగా మంత్రి పదవే ఇస్తున్నారు. రేపు అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయబోతున్నాడు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ ఫైర్ అయింది. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేడు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయబోతోంది. ఉదయం 11 గంటలకు ఎలక్షన్ కమిషన్ ను…
Amit Shah: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యాఖ్యల పదును పెరిగింది. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ అని స్పష్టం చేశారు.
ప్రధాని మోడీ-ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సారధ్యంలో అభివృద్ధిలో బీహార్ కొత్త శిఖరాలకు చేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారం ఉధృతం చేశారు.
దేశంలో ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట అబల బలైపోతుంది. తాజాగా తమిళనాడులో మరో ఘోరం జరిగింది. బైక్ టాక్సీపై వెళ్తున్న మహిళను అమాంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బైక్ వదిలేసి పరారైపోయాడు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.
ఉపరాష్ట్రపతి సీపీ.రాధాకృష్ణన్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారి సొంత రాష్ట్రంలో రాధాకృష్ణన్ పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం కోయంబత్తూరు చేరుకున్నారు. కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.
జూబ్లిహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మంగళవారం నియోజకవర్గంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ‘మాస్ కాంపెయిన్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ప్రతి ఓటరునూ కలుసుకుని ఓట్లు అభ్యర్థించేలా పాదయాత్రలు ఘనంగా నిర్వహించారు. ఎన్ రామచంద్రరావు ఎర్రగడ్డ డివిజన్లో పాదయాత్రలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడలో, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో…
Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు నగరాలు, పట్టణాల పేర్లను మార్చారు. లఖింపూర్ ఖేరీ జిల్లాలోని ముస్తఫాబాద్ గ్రామ పేరును ‘‘కబీర్ ధామ్’’గా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకున్నట్లు సీఎం యోగి చెప్పారు.
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన వైద్యురాలి ఆత్మహత్య కేసులో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్‌తో ముడి పడి ఉందని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ల అజెండా మజ్లిస్‌ను పెంచి పోషించడమే. డబ్బు కుమ్మరించడంలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి.
TPCC Mahesh Goud : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని, మంచి మెజారిటీ సాధిస్తామని వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ అంతర్గత విషయాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని మహేష్ గౌడ్ తెలిపారు. “మా ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో 46…