ప్రధాని మోడీ శుక్రవారం బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల ప్రచారాన్ని దివంగత మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న కర్పూరి ఠాకూర్ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
జూబ్లీహిల్స్ బైపోల్ కోసం కాషాయ దళం పక్కా ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తోందా? అందుకే ఆ లీడర్స్‌ని స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌లో చేర్చిందా? కులాల వారీ కేలిక్యులేషన్స్‌తో వాళ్ళు ప్రచార బరిలో దిగబోతున్నారా? పైకి కనిపించకున్నా… అంతర్గతంగా కూటమి పార్టీలు ఇక్కడ కూడా కలిసే అడుగులేస్తున్నాయా? ఎవరా స్టార్ క్యాంపెయినర్స్? ఎలా ఉంది కమలం ప్లాన్? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్‌గా మారింది. సిట్టింగ్ సీటు కోసం బీఆర్ఎస్, అధికారంలో ఉన్నాం…
బీహార్‌లో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే జన్ సురాజ్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీపై జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ధ్వజమెత్తారు.
పాతబస్తీలో భాగ్యలక్ష్మీ ఆలయం ఎక్కడుంది? అంటూ హేళన చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఈరోజు కళ్లు తెరిచి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి శక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం రావడం తన అద్రుష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్నాకే ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైందని, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచిందన్నారు. పార్లమెంట్ లో 8 స్థానాలు గెలుచుకోవడమే కాకుండా విజయ పరంపరను…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను అధికారులు లోనికి అనుమతించారు. ఆర్వో కార్యాలయం కాంపౌండ్ లో భారీగా క్యూ కట్టారు స్వతంత్ర అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. Also Read:Renu Desai…
Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్లు వేయగా, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత మూడు సెట్ల…
దీపావళి పండుగ వేళ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యవహార శైలి రాజకీయ దుమారం రేపుతోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆ విశ్వాసం ఉన్నవారికి మాత్రమే దీపావళి శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బీహార్‌లో ఎన్నికల సమరం కొనసాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేస్తుండగా.. విపక్ష కూటమి మాత్రం ఎవరికి వారే విడివిడిగా పోటీ చేస్తున్నారు. తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. రెండో విడత పోలింగ్ కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలులో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈరోజు ఒక్కరోజే 31 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారుల సమాచారం.
బీహార్‌లో రసవత్తరంగా ఎన్నికల సమరం సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడ్ పెంచారు.