సీబీఐ విచారణ వేసే దమ్ము ఉందా.? మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..!
మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పరకామణి కేసులో ఎవిఎస్వో సతీష్ కూమార్ ఆత్మహత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్ కూమార్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, ఇది సాధారణ ఆత్మహత్య కాదని అది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. తిరుపతి విజివో, డీఎస్పీ రాంకుమార్ పలుమార్లు సతీష్ కూమార్‌ను తీవ్రంగా వేధించారని తెలిపారు. సిఐడి విచారణలో అధికారులు అతన్ని భూతులు తిట్టి, హింసించారని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. సతీష్ తన సన్నిహితులకు “సిఐడి విచారణ తర్వాత బతకడం కంటే చనిపోవడం మంచిదనే భావన కలిగింది” అని చెప్పాడన్న విషయాన్ని భూమన వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే ఆత్మహత్య వెనుక ఒత్తిడి, బెదిరింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
చెన్నైలో కూలిన శిక్షణ విమానం.. పైలట్ సేఫ్
చెన్నై సమీపంలోని తండలం బైపాస్ సమీపంలోని ఉపల్లం ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం భారత వైమానిక దళ శిక్షణ విమానం కూలిపోయింది. సింగిల్ సీటర్ శిక్షణ విమానం సాధారణ శిక్షణ విమానంలో ఉంది. ఈ ప్రమాదం మధ్యాహ్నం 2:50 గంటల ప్రాంతంలో జరిగింది. విమానం అదుపు తప్పుతోందని గ్రహించిన పైలట్ వెంటనే పారాచూట్ సహాయంతో కిందకు దూకాడు.
రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో ‘అరైవ్ & అలైవ్’ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ అదనపు సీపీ జోయిస్ డేవిస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు, యువత, వివిధ సంస్థల ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ‘అర్రివ్ అలైవ్’ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న ముఖ్యమైన చర్యగా అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు దెబ్బతింటున్నాయని, ప్రతిరోజూ జరుగుతున్న ప్రమాదాలను గుర్తు పెట్టుకొని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నిసార్లు ఓటములు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యే ఉంటుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి ఆయనను సన్మానించి అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలైన ఓట్లలో 51 శాతం కాంగ్రెస్‌కు రావడం, గత రెండేళ్ల తమ పాలనపై ప్రజల నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని అన్నారు. బీఆర్‌ఎస్‌కు 38 శాతం, బీజేపీకి 8 శాతం ఓట్లు రావడం, నగర రాజకీయ దిశను సూచిస్తోందని వ్యాఖ్యానించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ధోరణి కొనసాగుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
అది నన్ను జీవితాతం బాధిస్తోంది.. బాబు మోహన్ ఎమోషనల్
ప్రముఖ నటుడు బాబు మోహన్ మరోసారి ఎమోషనల్ అయ్యాడు. నటుడుగా ఎంతో పేరు సంపాదించుకున్న ఆయన.. పొలిటికల్ గా ఆ స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నాడు. తజాఆగా చిల్డ్రన్స్ డేలో భాగంగా ఓ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. చిన్నప్పుడే నాకు పోలీస్ అవ్వాలి అనే పెద్ద కోరిక ఉండేది. జంబలకడిపంబ సినిమాలో పోలీస్ పాత్ర దక్కడంతో ఆ కల కొంతవరకు నెరవేరింది. అందుకే ఈరోజు పిల్లలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అలవాటు అయింది. సినిమాలో హీరోలా స్పీడ్‌గా బైక్ లు నడపకండి. నా కొడుకు చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్న టైమ్ లో బైక్ కొనుకుని ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో నడుపుతుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఎంతో మందిని నవ్వించిన నేను… నా కొడుకు గురించి ఆలోచన వచ్చే ప్రతీసారి కన్నీళ్లు ఆగవు. ఆ బాధ నాకు జీవితాంతం ఉండిపోతుంది. కోట శ్రీనివాసరావు గారి కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడు. మేమిద్దరం ప్రతి సారి కలిసినప్పుడు మా పిల్లల గురించి మాట్లాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకునేవాళ్లం అని బాబు మోహన్ ఏడ్చేశారు.
బీహార్‌లో ఎన్డీఏ ఘన విజయం.. సీఎం నితీష్ కుమార్‌కు ప్రధాని అభినందనలు
బీహార్ ముఖ్యమంత్రి, నితీష్ కుమార్, ఇతర జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) నాయకులకు ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అధికార కూటమి విజయం సాధించినందుకు ఆయన అభినందించారు. ఈ “అద్భుతమైన ప్రజల తీర్పు”తో బీహార్ ప్రజలకు సేవ చేసే శక్తి ఎన్డీఏకు లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఎన్డీఏ బీహార్‌లో అన్ని రకాల అభివృద్ధిని అందించడం వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైందని ప్రధాని వరుస ‘ఎక్స్’ పోస్టుల్లో తెలిపారు. ఈ విజయాన్ని “సుపరిపాలన విజయం, అభివృద్ధి విజయం, ప్రజా సంక్షేమ స్ఫూర్తి విజయం, సామాజిక న్యాయం విజయం”గా ఆయన అభివర్ణించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏను చారిత్రక, అపూర్వ విజయంతో ఆశీర్వదించిన బీహార్ ప్రజలకు ఆయన తన ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు.
మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నాం
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బీహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించిందన్నారు. బీహార్‌లో సంక్షేమం, సామాజిక న్యాయం విజయం సాధించిందని, విజయంతో ఆశీర్వదించిన బీహార్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోడీ. బీహార్ తీర్పు నూతన సంకల్పంతో పని చేయడానికి శక్తినిచ్చిందని, అవిశ్రాంతంగా పని చేసిన ప్రతి ఎన్డీయే కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాల అబద్ధాలను మా కార్యకర్తలు తిప్పికొట్టారని ప్రధాని మోడీ ప్రశంసించారు. బీహార్ ప్రజలు అన్ని రికార్డులు బద్దలు కొట్టారని, మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నామని మోడీ వ్యాఖ్యానించారు.
బీహార్ ప్రజల తీర్పును తాము అంగీకరిస్తున్నాము.. అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) అద్భుత ప్రదర్శన చేసినందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందించారు. ఏఐఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించిన లేదా ఆధిక్యంలో ఉన్న ఐదు స్థానాల ఓటర్లకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ ప్రజలు ఏఐఎంఐఎంకు ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఐదు స్థానాల్లో కష్టపడి పనిచేసిన అభ్యర్థులు, పార్టీ సభ్యులకు ఒవైసీ అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ MMC పార్టీగా మారింది..
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీహార్ విజయోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాల్లో అద్భుత విజయాలు సాధించామని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ కొన్ని దశాబ్ధాలపాటు దేశాన్ని పాలించిందని, కానీ ప్రజలకు ఆ పార్టీమీద క్రమంగా విశ్వాసం సన్నగిల్లుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయిందని, ఇప్పుడున్న కాంగ్రెస్ MMCగా మారింది. MMC అంటే ముస్లిం మావోవాది కాంగ్రెస్ అని ప్రధాని అన్నారు.
బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి దూకుడు.. ఏపీలో సంబరాలు
బీహార్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు ఎన్డీఏ గా ఏర్పడి ఘనవిజయం సాధించిన సందర్భంగా రాజమండ్రిలో సంబరాలు జరుపుకున్నారు బీజేపీ నాయకులు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ లో బీజేపీ శ్రేణులు బీహార్ విజయోత్సవాలను జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, ఆ తర్వాత హాజరైన కార్యకర్తలకు మిఠాయిలు పంచి.. ‘బీజేపీ వర్ధిల్లాలి’.. ‘నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి’ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకోన్నారు. బీహార్ లో ఏకపక్షంగా 243 స్థానాలకు గాను 200 స్థానాలకు పైగా బీజేపీ కూటమి సునామీగా విజయ ప్రభంజనం సాధించడం బీహార్ ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వానికి ఇస్తున్న మద్దతుగా అభివర్ణించారు. బీహార్ లో ప్రతిపక్ష కూటమి ఎన్ని అవాంచితమైన అపనిందలు కూటమిపై వేసినప్పటికీ నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల, అలాగే నితీష్ కుమార్ నాయకత్వం పట్ల ప్రజలు నమ్మకాన్ని చూపిస్తూ ఇంతటి ప్రభంజనమైన విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి ఇది ఒక చంప పెట్టని రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ పై ఎన్ని కుట్రలు పన్నినా దేశ ప్రజలు బీహార్ ప్రజలు విశ్వాసంతో ఉన్నారన్న దానికి ఈ ఎన్నికల ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన కార్యకర్తలందరూ ప్రశ్నించే పని చేస్తే ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ ఏకపక్షంగా విజయాలు సాధించడం జరుగుతుంది బీజేపీ శ్రేణులు అన్నారు.