Pakistan vs Namibia: “బతికిపోయారు”.. డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్థాన్ సూపర్ విక్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan vs Namibia: నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిస్తేనే నెక్ట్స్ మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్‌కు అవకాశం ఉండేది. ఈ ఒత్తడిలోనూ పాక్ ప్లేయర్లు అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్ బతికి పోయింది. పాక్ జట్టు ఏకంగా 102 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణం ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan). సాహిబ్జాదా ఫర్హాన్ కేవలం 58 బంతుల్లోనే 100 పరుగులు చేసి టీమ్‌ను అజేయంగా నిలిపాడు. తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ప్రారంభం నుంచే ధైర్యంగా ఆడుతూ నమీబియా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేశాడు.
READ MORE: Mammootty: అనారోగ్యంపై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన అగ్రహీరో.. అసలు ఏమైందో తెలుసా!
Also Read
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
ఫర్హాన్‌కు మద్దతుగా సల్మాన్ ఆగా 23 బంతుల్లో 38 పరుగులు చేశాడు. షాదాబ్ ఖాన్ సైతం 22 బంతుల్లో 36 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోరు అందించాడు. దీంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఈ స్కోరు నమీబియాకు చాలా పెద్ద లక్ష్యంగా మారింది. ఛేజ్ చేసే ప్రయత్నంలో నమీబియా బ్యాటర్లు వరుసగా ఔటవుతూ ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. లౌరెన్ స్టీన్‌క్యాంప్ 23, అలెగ్జాండర్ వోల్స్‌చెంక్ 20 పరుగులు చేసినప్పటికీ, మిగతా బ్యాటర్లు పెద్దగా నిలబడలేకపోయారు. మొత్తం జట్టు 17.3 ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలింది. బౌలింగ్‌లో ఉస్మాన్ తారిక్ నాలుగు వికెట్లు తీసి నమీబియాను కట్టడి చేశాడు. అతని స్పిన్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు పూర్తిగా గందరగోళంలో పడిపోయింది. ఈ విజయంతో పాకిస్తాన్ తదుపరి రౌండ్‌లోకి అడుగుపెట్టింది. సూపర్ ఎయిట్ గ్రూప్ 2లో ఇప్పటికే ఉన్న న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో జతకట్టింది. ఈ మ్యాచ్‌లో ఫర్హాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. “నేను దేశీయ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వను. గత నాలుగేళ్లుగా దేశీయ క్రికెట్‌లో కష్టపడి ఆడుతున్నాను. ఆ కష్టానికి ఇదే ఫలితం” అని ఫర్హాన్ ఆనందంగా చెప్పాడు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!