Bihar: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 243 సీట్లలో 202 స్థానాలు సాధించింది. బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ 19, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) 05 సీట్లు గెలుచుకున్న ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్ మోర్చా 04 స్థానాలు గెలుచుకున్నాయి. నితీష్ కుమార్ సారధ్యంతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీయే కూటమి సిద్ధమైంది. సీఎంగా నితీష్ కుమార్ దాదాపుగా ఖరారయ్యారని తెలుస్తోంది. ఈ నెల 19-20 తేదీల్లో ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది.
Read Also: Delhi Car Blast: ఢిల్లీ కార్ బాంబ్ బ్లాస్ట్‌లో డాక్టర్ ప్రియాంకా శర్మకు సంబంధం..
ఇదిలా ఉంటే, ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలకు ఎన్ని మంత్రి స్థానాలు ఇవ్వాలనే దానిపై ఇప్పటికే ఫార్ములా రెడీ అయింది. కేంద్రం హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఎన్డీయే సమావేశంలో పవర్ షేరింగ్ ఫార్ములా సిద్ధమైంది. ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో బీజేపీకి 15-16 మంత్రి పదవులు, జేడీయూకు 14 మంత్రి పదవులు, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీకి 4 క్యాబినెట్ పదవులు పొందవచ్చు. ఇక జితన్ రామ్ మాంఝీ హిందుస్తానీ అవామ్ మోర్చా సెక్యులర్ పార్టీకి, ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీ లోక్ మోర్చాకు ఒక్కో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.