Daggubati Purandeswari: ఎన్డీఏ కూటమి బీహార్‌లో అద్భుతమైన విజయం సాధించిందని 68 శాతం ఓటింగ్ సాధించడం గొప్ప విశేషమని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాలల్లో చేసుకుని వెళ్తే విజయాలు ఎలా ఉంటాయో ఇది ఒక నిదర్శనమని ఆమె అన్నారు. బీహార్‌లో నితీష్ కుమార్ దేశంలోనే అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఉందని, బీహార్ ప్రజలు ఎన్డీఏకు మళ్లీ పట్టం కట్టారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఇవే ఫలితాలు ఎన్డీఏకు రాబోతున్నాయని ఆమె అన్నారు. బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా ప్రధాని మోడీ , జేపీ నడ్డా, నితీష్ కుమార్ లకు అభినందనలు తెలిపారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.
Read Also: Rukmini Vasanth: గట్టిగా రెమ్యునరేషన్ పెంచేసిన రుక్మిణీ వసంత్
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.. బీహార్ లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి.. అభివృద్ధి, సంక్షేమ సమపాల్లో చేసుకుని వెళ్తే విజయాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనం అన్నారు.. ఇక, విశాఖలో జరుగుతున్న సిఐఐ సదస్సుతో. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.. రాష్ట్ర అభివృద్ధికి ఇది ఎంతో అవసరం.. పెట్టుబడులను అందరూ స్వాగతించాలని సూచించారు.. పెట్టుబడులు బోగస్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేయడం దురదృష్టకరం.. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏం పనిలేదు, అందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, శాఖల వారీగా 2027 గోదావరి పుష్కరాలకు సమగ్ర ప్రణాళిక తయారు చేస్తున్నాం.. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి..