Ambati Rambabu: నన్ను చంపడానికి యత్నించారు.. అంబటి సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనను చంపడానికి కూడా ప్రయత్నించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నన్ను బయటకు రాకుండా అడ్డుకోవాలని చూశారు. ఎన్ని రోజులైనా జైల్లోనే ఉండాలని వెళ్లాను. జైలులో పెడితే భయపడే వ్యక్తిని కాదు అని అంబటి స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఒకవేళ తప్పు చేసినా వెంటనే క్షమాపణలు చెప్పానని తెలిపారు. అయినప్పటికీ తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
Read Also: Vishnu Vinyasam Teaser: శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ టీజర్ మామూలుగా లేదుగా!
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
తన కష్టసమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు అంబటి రాంబాబు.. నా ఇంటిపై 7 గంటల పాటు దాడి చేశారు. నా భార్యా పిల్లలను వేధించారు. ఆ దాడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మానిటర్ చేశారు అని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు పోరాడతాం.. నన్ను చంపడానికి ప్రయత్నించారు.. అన్నింటికీ దేవుడే సమాధానం చెబుతాడు అని వ్యాఖ్యానించారు. అలాగే తాను గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట నడిచానని, ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నానని తెలిపారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే నడుస్తాను అని స్పష్టం చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, జైలు జీవితాన్ని కూడా ఎంజాయ్ చేశానని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇక, పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టలేదు.. జైలు బాత్‌రూమ్‌లో జారి పడనాన్న అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!