Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు హర్యానా యమునా నదిలో ‘‘విషం’’ కలుపుతోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలకు రుజువులు ఇవ్వాలని ఎన్నికల సంఘం మంగళవారం కేజ్రీవాల్‌కి లేఖ రాసింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు రుజువులు ఇవ్వాలని ఆదేశించింది.
Sam Pitroda: ఢిల్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ సన్నిహితుడు సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘బంగ్లాదేశీ అక్రమ వలసదారుల్ని’’ భారత్‌లోకి రానివ్వాలంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై బీజేపీ మండిపడుతోంది. గతంలో కూడా సామ్ పిట్రోడా చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెట్టాయి. లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయులపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి దేశ ప్రజల ఆగ్రహానికి గురికావల్సి వచ్చింది.
కూటమిలో విజయసాయిరెడ్డిని చేర్చుకోవడానికి వీల్లేదని, అలా చేర్చుకుంటారని అనుకోవడం లేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Prakash Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పద్మ అవార్డులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయని ఆయన ఆరోపించారు. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పద్మ అవార్డుల ప్రకటన ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ప్రకాష్ రెడ్డి తప్పుపట్టారు. ముఖ్యమంత్రి పద్మ అవార్డులకు…
IAS Officers Transfer: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సోమవారం నాడు అర్థరాత్రి సీఎం కార్యదర్శి సహా 42 మంది ఐఏఎస్ అధికారులను కేంద్ర సర్కార్ ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Mallikarjun Kharge: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద కామెంట్స్ చేవారు. గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తే పేదరికం పోతుందా..? అని బీజేపీ నేతల్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ మోవ్‌లో జరుగుతున్న ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో సోమవారం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు కెమెరాల కోసం స్నానాలు చేస్తున్నారని ఆరోపించారు.
Chandigarh Mayoral Poll: చండీగఢ్ మేయర్ ఎన్నికకు ముందే కాంగ్రెస్‌కి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ కౌన్సిలర్ గుర్బక్ష్ రావత్ బీజేపీలో చేరడంతో హస్తం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌కి మొత్తం 7 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇప్పుడు ఆ పార్టీకి ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే మిగిలిపోయారు. బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య 16కి పెరిగింది. చండీగఢ్ లోని బీజేపీ కార్యాలయంలో, చండీగఢ్ బీజేపీ అధ్యక్షుడు జతీందర్ పాల్ మల్హోత్రా, పార్టీ సీనియర్ల సమక్షంలో రావత్ బీజేపీలో చేరారు.
Rahul Gandhi: మధ్యప్రదేశ్ మోవ్‌లో జరిగిన ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం’ ర్యాలీని సోమవారం కాంగ్రెస్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్పై మరోసారి విరుచుకుపడ్డారు. మన రాజ్యాంగాన్ని మార్చిన రోజు దేశంలో వెనకబడిన వారికి, దళితులకు, గిరిజనులకు ఒరిగేది ఏం ఉండదని అన్నారు.
AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఆప్, బీజేపీ మధ్య భారీ పోటీ నెలకొంది. పోటాపోటీగా ఇరు పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా, ఆప్ మరోసారి ఢిల్లీ ప్రజలపై హామీల జల్లు కురిపించింది. సోమవారం తన మానిఫెస్టోని విడుదల చేసింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, కర్నాటక బీజేపీ సహా ఇంఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 శాతం మండలాల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.