Telangana MLAs: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు తమ పార్టీ మార్పుపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి నోటీసుల్లో పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి. అయితే, ఈ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వడానికి మరింత సమయం కావాలని కోరుతున్నారు. అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన ఈ నోటీసులు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, ఈ నోటీసులు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read Also: Gold Rates: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఏకంగా రూ. 1050 పెరిగిన పసిడి ధర
దీనితో ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. లిఖిత పూర్వక సమాధానం ఇచ్చే ముందు, వారు తాము చేపట్టనున్న కార్యాచరణపై కీలకంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.