గత 30 సంవత్సరాలుగా SR ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను చేసినా సేవాకార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే అంటున్నారు బీజేపీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన.. నేను ఈ ఉమ్మడి మెదక్ జిల్లా వాసిగా మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు..
Kishan Reddy: రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు “పచ్చ కామెర్లు వచ్చిన ఒకతను లోకమంతా పచ్చగా కనిపిస్తోంది” అనే సామెతకు అచ్చంగా సరిపోతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ఉపాధి అవకాశాల అభివృద్ధి దారుణంగా ఉంటే, అదే అంశాన్ని ఎన్డీయే ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ అవివేకానికి నిదర్శనమని అన్నారు. కిషన్ రెడ్డి ఇటీవల తెలిపిన గణాంకాలను పరిశీలిస్తే, మోడీ హయాంలో ఉపాధి పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఉపాధి విషయంలో ప్రత్యేకంగా…
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ టార్గెట్‌గా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ రేంజ్ ప్రచారం జరుగుతోంది. అందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా... ప్రచారం మాత్రం కచ్చితంగా ఆయనకు బీజేపీ పరంగా వచ్చే అవకాశాల్ని దెబ్బ తీస్తుందన్న అంచనాలున్నాయి. దీంతో.. సోషల్ మీడియా వేదికగా ఈటలను కేంద్ర బిందువుగా చేసుకుని జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందా? లేక ఎవరైనా కావాలని టార్గెట్ చేస్తున్నారా అన్న ఆరాలు పెరిగిపోతున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో.
జమ్మలమడుగు పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. ఏదో ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతుంటాయి. ఇప్పుడిక్కడ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఢీ అంటే ఢీ అంటుండటం కాక రేపుతోంది. ఒకరిది ఇప్పుడు కాకున్నా... గతంలో ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఉన్న ఫ్యామిలీ. మరొక నాయకుడిది వ్యాపార కుటుంబం. జమ్మల మడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న రాజకీయం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కొత్త సమీకరణలకు దారి తీస్తోందని…
Dinesh Sharma: గృహ హింస, మహిళలపై దోపిడీ చట్టాలను దుర్వినియోగం చేయడంపై గత కొంత కాలంగా దేశంలో చర్చ నడుస్తోంది. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతడి భార్య తప్పుడు గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టిన కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. దీంతో ఇలా చట్టాలను దుర్వినియోగం చేసే…
పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తోంది అన్నాడట.. అచ్చం అలాగే, రాహుల్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలకు ఈ సామెతకు సరిపోతుందన తెలిపారు. ఇక, రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను చూసి, వాటిని ఎన్డీయే సర్కారుకి ఆపాదించడం అతని అవివేకానికి నిదర్శనం అన్నారు. ఉపాధి విషయంలో ప్రత్యేకంగా రాహుల్ కోసం కొన్ని వాస్తవాలను ఇక్కడ తెలియజేస్తున్నాను అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
కుల సంఘాలను సర్వేలో పాల్గొనాలి అని చెప్పిన పాల్గొనలేదు.. ఈ సర్వేలో కావాలనే కొంత మంది పాల్గొన లేదు అని ఆయన వెల్లడించారు. సర్వేలో ప్రజలు చెప్పిన సమాచారమే నమోదు చేశాం.. ఇక, ఎస్సీ వర్గీకరణపై సాయంత్రం 7గంటలకు మరోసారి సమావేశం అవుతాము.. కుల గణన సర్వేకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొద్ది రోజులుగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించారు. విమర్శలు.. ప్రతి విమర్శలతో మాటల యుద్ధం సాగించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి దగ్గర హల్చల్ చేసింది. పూర్వాంచల్‌కు చెందిన కొంతమంది మహిళలతో కలిసి యమునా నది నీళ్లు తీసుకుని కేజ్రీవాల్ ఇంటి దగ్గర నిరసన చేపట్టింది.