దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 60 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి.
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. భారతదేశం సాధించిన విజయాలు, మన నుంచి ప్రపంచం ఆశించేవి, సామాన్యుల ఆత్మవిశ్వాసం, భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో వివరంగా చర్చించారు.
మళ్లీ అధికారంలోకి వస్తాం.. జగన్ 2.0 వేరుగా ఉంటుంది.. ఈసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు మనదే పాలన ఉంటుందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఎటాక్ చేశారు.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా కోల్పోయారు... 30 ఏళ్ల నా పాలన, 175 /175 ఎమ్మెల్యే, 25/25 ఎంపీలు అనే వారు అంటూ ఎద్దేశా చేశారు..
తెలంగాణ బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికి 19 జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది పార్టీ. మరో 19 పెండింగ్‌లో ఉన్నాయి. కానీ... ప్రకటించిన జిల్లాల్లో సమతౌల్యం కనిపించటడం లేదన్న టాక్ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ప్రజల మూడ్ బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ కొన్ని సార్లు నిజం అయ్యాయి.. కొన్ని సార్లు అబద్ధం అయ్యాయని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ - కరీంనగర్ - మెదక్ - ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి బరిలోకి దిగిన చిన్నమైల్ అంజిరెడ్డి.. ప్రచారంలో దూకుడు పెంచారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా భీఫామ్ అందుకున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కుమార్తె అశ్విత.. తండ్రి విజయం కోసం కుమార్తె తాపత్రయం పట్ల హర్షం వ్యక్తం చేశారు కిషన్‌రెడ్డి.. మరోవైపు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్‌లో జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల…
Delhi Exit Polls : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం EVMలో నిక్షిప్తం అయింది.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ సమావేశం నిర్వహించింది.
Delhi Exit Poll: 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 5, 2025న జరుగుతోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయి ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఢిల్లీలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.