Indian Army Secret Mission: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం కేంద్రం ప్రకటించిన ‘శౌర్యచక్ర’ పురస్కారాలతో భారత సైన్యం నిర్వహించిన ఒక కోవర్ట్ ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ రహస్య ఆపరేషన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందనే విషయాలను బహిర్గతం చేయడం చాలా అరుదు. తాజాగా కేంద్రం ప్రకటించిన ‘శౌర్యచక్ర’ పురస్కార ప్రకటనతో ఈ రహస్య ఆపరేషన్ వివరాలు వెల్లడయ్యాయి. ఇంతకీ ఈ సీక్రెట్ ఆపరేషన్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: కేవలం రూ.3,500కే గోవా టూర్..! TGSRTC అదిరిపోయే ఆఫర్.. మిస్ కావద్దు.!
ఇండియాకు మయన్మార్‌తో దాదాపు 1600 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ప్రాంతం నుంచి గత కొన్నేళ్లుగా ఉల్ఫా(ఐ) అస్సాంకు ప్రత్యేక ప్రతిపత్తిని డిమాండ్ చేస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో గతేడాది భారత సైన్యం మయన్మార్ భూభాగంలో ఓ రహస్య ఆపరేషన్ నిర్వహించింది. మన సైన్యం ఈ కోవర్ట్ ఆపరేషన్‌ను మయన్మార్ భూభాగంలో ఉన్న మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని నిర్వహించింది. భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో 2025 జులై 11 నుంచి 13 వరకు ఈ ఇండియన్ ఆర్మీ ఈ సీక్రెట్ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో 9 మంది మిలిటెంట్ నాయకులు మరణించారు. గతేడాది జులైలో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఇండిపెండెంట్) (ఉల్ఫా (ఐ)) విడుదల చేసిన ఒక ప్రకటనలో మయన్మార్‌లోని సగైంగ్ ప్రాంతంలో జరిపిన డ్రోన్లు, క్షిపణి దాడుల్లో తమ సంస్థకు చెందిన అగ్ర నాయకులు మరణించినట్లు ప్రకటించింది. అప్పట్లో ఈ సంస్థ ఈ దాడి చేసింది భారత ఆర్మీనేనని ఆరోపించింది. కానీ దీనిపై ఆనాడు కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిజానికి ఇలాంటి ఒక సీక్రెట్ ఆపరేషన్ గురించి కేంద్రం ధ్రువీకరించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్రం ప్రకటించిన శౌర్య చక్ర అవార్డుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
21వ పారా స్పెషల్‌ఫోర్స్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఘటాగె ఆదిత్య శ్రీకుమార్‌కు కేంద్రం ప్రకటించిన ‘శౌర్యచక్ర’ అవార్డుతో ఈ స్పెషల్ ఆపరేషన్ గురించి బయటికి వచ్చింది. మయన్మార్ భూభాగంలో అత్యంత కచ్చితత్వంతో ఈ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి మిలిటెంట్ క్యాంప్‌ను ధ్వంసం చేసినందుకు ఆదిత్య శ్రీకుమార్‌ను కేంద్రం ఈ పురస్కారంతో సన్మానించింది. దేశ వ్యతిరేక ముఠాలకు చెందిన శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది. పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
READ ALSO: Pakistan T20 World Cup: దాయాదుల మధ్య పోరుకు ఈ రోజు పాకిస్థాన్‌లో హైప్రొఫైల్ మీటింగ్..