ఢిల్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది. కస్తూర్బా నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి నీరజ్ బసోయా విజయం సాధించారు. ఇప్పటివరకు బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా లక్ష్మీనగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ విజయ దుందుబీ మోగించారు..ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ కొండ్లి స్థానం నుంచి విజయం సాధించారు. అదే సమయంలో న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ 1800 ఓట్ల వెనుకబడి ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ పెద్ద ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు.
READ MORE: Delhi Election Results: ఢిల్లీ ఎన్నికల్లో తొలి ఫలితం.. ఆ పార్టీ ఘన విజయం..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్‌ని ఉడ్చిపడేస్తోంది. గత దశాబ్ధ కాలంగా ఢిల్లీని పాలిస్తున్న అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ ఓటర్లు షాక్ ఇచ్చారు. 27 ఏళ్ల తర్వాత బీజేపీకి తిరిగి పట్టం కట్టబోతున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు మధ్యతరతగతి, పూర్వాంచలి ఓటర్లు మద్దతు ఇచ్చారు. గతంలో ఈ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మద్దతుగా నిలిచారు. ఈసారి మాత్రం ఆప్‌ని యమునలో ముంచారు. పశ్చిమ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, మధ్య ఢిల్లీ, న్యూఢిల్లీ అంతటా మధ్యతరగతి ఆధిపత్యం ఉన్న చాలా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కనిపించింది. ఇదే విధంగా తూర్పు యూపీ, బీహార్ నుంచి వచ్చిన పూర్వాంచలి ఓటర్లు గణనీయమైన ప్రభావాన్ని చూపగలిగే 25 స్థానాల్లో కూడా బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. అనధికారిక కాలనీలు కలిగిన ట్రాన్స్ యమునా ప్రాంతంలోని 20 సీట్లలో బీజేపీ 10 సీట్లకు పైగా ఆధిక్యంలో ఉంది.