రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుండే భారీ అంచనాలను పెంచేస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ గత చిత్రం ‘ఖుషి’ పోస్టర్‌కి, తాజా VD14 పోస్టర్‌కి మధ్య ఒక చిన్న మార్పును గమనించిన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆ మార్పు విజయ్ ఇమేజ్‌లో వచ్చిన ఎదుగుదలను సూచిస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా టైటిల్ కార్డులో అలాగే పోస్టర్లలో “THE Vijay Deverakonda” అని ఉంటుంది. ఇది విజయ్ ఒక బ్రాండ్‌గా ఎదిగిన తీరుకు నిదర్శనంగా అప్పట్లో ఆయన ఫ్యాన్స్ చెప్పుకునేవారు. ‘ఖుషి’ పోస్టర్‌లో కూడా మనం ఇదే గమనించవచ్చు. అయితే, తాజాగా విడుదలైన VD14 పోస్టర్‌లో మాత్రం కేవలం “VIJAY DEVERAKONDA” అని మాత్రమే ఉంది. ‘THE’ అనే పదాన్ని తీసివేయడం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది.నిజానికి విజయ్ గత చిత్రం కింగ్డమ్ కే ఆ ట్యాగ్ తొలగించారు, అయినా ఈ ది ట్యాగ్ గురించి ఇప్పుడు మళ్ళీ చర్చ జరుగడం గమనార్హం.
Also Read:Chiranjeevi: రేంజ్ రోవర్ వెనుక అసలు రహస్యం ఇదే: చిరంజీవి-అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఫిక్స్!
ఇదే విషయాన్ని గమనించిన ఓ నేటిజన్ ఆ రెండు పోస్టర్లు షేర్ చేసి రెండిటి మధ్య తేడా ఏంటి అని అడిగితే విజయ్ దేవరకొండ మాత్రం తెలివిగా స్పందిస్తూ.. “Double The Scale.. Bigger The Responsibility.. Stronger The Force” (రెట్టింపు స్థాయి.. అంతకు మించిన బాధ్యత.. మరింత శక్తివంతమైన బలం) అంటూ పేర్కొన్నారు. ఒక కథ తన ఆత్మను, హృదయాన్ని డిమాండ్ చేసినప్పుడు ఇలాంటి మార్పులు సహజమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం 19వ శతాబ్దం నాటి కథా నేపథ్యంతో సాగే ఒక అడ్వెంచర్ డ్రామా అని తెలుస్తోంది. గతంలో విజయ్‌కి ‘టాక్సీవాలా’ వంటి హిట్‌ను అందించిన రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ,”The Legend of the Cursed Land” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా అసలు పేరును 26.1.26న (ఈరోజు) ప్రకటించనున్నారు. ఖుషి’ వంటి కూల్ లవ్ స్టోరీ తర్వాత, ఒక పవర్‌ఫుల్ పీరియడ్ ఫిలింతో విజయ్ తనలోని అసలు నటుడిని బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
Double The Scale
Bigger The Responsibility
Stronger The ForceA Story that deserves THE heart and Soul. https://t.co/bsoBTbwlwY
— Vijay Deverakonda (@TheDeverakonda) January 25, 2026