Etela Rajender : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదాస్పద ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను ఫోన్ చేసి మళ్లీ కలిసి పని చేయాలని పిలిచారన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని తేల్చిచెప్పారు. ‘‘నేనంటే గిట్టని వారు, సోషల్ మీడియాలో ఉండే సైకోలు, శాడిస్టులు మాత్రమే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు’’ అని ఖండించారు. తాను చాలా కాలంగా బీఆర్ఎస్, కేసీఆర్ విషయంలో…
AAP vs BJP: ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. పోలింగ్ కేంద్రాలలో నగదు పంపిణీతో పాటు దొంగ ఓట్లు వేస్తున్నారని ఇర పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ నేతలు, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు ఢిల్లీ సీఎం ఆతిశీ, ఆప్ అధినేత, అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి జై శంకర్తో పాటు పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయినప్పటికి.. ఉదయం 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ.. ఆప్, బీజేపీల మధ్య చోటుచేసుకుంటున్న ఆరోపణలు హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా బీజేపీ ఢిల్లీ సీఎంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె పీఏ రూ. 5 లక్షలతో పోలీసులకు పట్టుబడ్డాడంటూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ తెలిపారు. అతిశీ పీఏ గిరిఖండ్ నగర్ లో రూ. 5 లక్షలతో పోలీసులకు చిక్కాడంటూ బాంబ్ పేల్చాడు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైందని వెల్లడించాడు. కల్కాజీలోని ఓటర్లను మభ్య పెట్టేందుకు డబ్బు పంచేందుకు…
Delhi Elections 2025: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాగా.. తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Delhi Assembly Election 2025 Live UPDATES: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 1.56 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
Raghunandan Rao: లోక్ సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు.. కుల గణన గురించి గొప్పగా చెప్పే రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం పదవి బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Satya Kumar Yadav: ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాప్తి పెను సవాల్ గా మారిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. ఇప్పటి వరకు 17.5 శాతం కాన్సర్ కారణంగా మరణిస్తున్నారని తెలిపారు. 9 శాతం మరణాలు క్యాన్సర్ వాళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి.
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కి రంగం సిద్ధమైంది. రేపు(ఫిబ్రవరి 05)న ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది.