గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై విచారణల్లో దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలి అని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. కాగా, బ్యాంకులు ఈ విచారణలకి తగిన సహకారాన్ని అందించాలని పేర్కొన్నారు.
బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి బరువు 25 వేల 1 రూపాయి నాణేలు కార్మికుల సమావేశంలో పాల్గొనేందుకు బీహార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ దర్భంగా చేరుకున్నారు. ఈ సమయంలో కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ అతనికి మిథిల సంప్రదాయం ప్రకారం తలపాగా, దుప్పటి ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర అధ్యక్షుడి ఈ సందర్శనను తనకు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఏర్పాట్లు చేశారు. తనకు ఒక రూపాయి నాణెలతో త్రాసుపై తూకం వేశారు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆదివారం అతిషి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాను కలిసి రాజీనామాను సమర్పించారు. సోమవారం ఆమె రాజీనామాను ఎల్జీ ఆమోదించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫలితాలు వచ్చి రెండు రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. 2027లోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పంజాబ్‌లోనే ఆప్ ప్రభుత్వం ఉంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పుణ్యస్నానాల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ కూడా ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పుణ్యస్నానం చేశారు.
INDIA bloc: ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ పరాజయం, కాంగ్రెస్ ఘోర పరాజయం ఇండియా కూటమి భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేశాయి. కూటమిలోని ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోక పోవడంతోనే అధికారం కోల్పోయాయని మిత్రపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే, అనుమానాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో చీలికలు ఉన్నాయనే వాదనల్ని తోసిపుచ్చారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, మళ్లీ లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు కలిసి వస్తాయని అన్నారు. Read Also: Asteroid: భూమికి…
Prashant Bhushan: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తో సహా కీలక నేతలైన మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్, సత్యేందర్ జైన్ వంటి వారు కూడా ఓడిపోయారు. కీలక నేతల్లో కేవలం అతిశీ మార్లేనా మాత్రమే విజయం సాధించారు. బీజేపీ, ఆప్‌ని ఒక విధంగా ఉడ్చేసిందని చెప్పొచ్చు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 బీజేపీ గెలుచుకోగా, ఆప్ 22 చోట్ల మాత్రమే విజయం…
BJP Celebrations: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఢిల్లీ ఎన్నికల విజయోత్సవ సంబరాలు నేడు (ఆదివారం) ఘనంగా జరిగాయి. గతంలో సికింద్రాబాద్‌లో బీజేపీ కార్యకర్త మృతి చెందడంతో విజయోత్సవాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. బీజేపీ కార్యకర్తలు బ్యాండ్ వాయిస్తూ, టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తల ఉత్సాహం మధ్య కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి డా. లక్ష్మణ్ ప్రసంగించారు. Read Also: Kaleshwaram: కాళేశ్వరంలో…
దేశ వ్యాప్తంగా కమల వికాసం కనిపిస్తోందని, 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అద్భుతమైన సంపూర్ణ విజయం లభించిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కార్యకర్తల కృషి వల్లే ఢిల్లీలో విజయం సాధ్యమైందని, ఈ గెలుపు వారికే అంకితం అని పేర్కొన్నారు. ఢిల్లీలో 10 ఏళ్లు మభ్యపెట్టి వంచించిన ప్రభుత్వాన్ని పక్కనపెట్టి.. ప్రజలు సుపరిపాలనకు అవకాశం కల్పించారన్నారు. డబులు ఇంజన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి సాధ్యం అని ఢిల్లీ ప్రజలు నమ్మారన్నారు. ఢిల్లీ, ఏపీ…