బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆపార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బిజెపి ఎంపీ అరవింద్. నీ వెంట్రుకలు నీ గోర్లు ఎవరికి కావాలి? నీ కిడ్నీలు ఎవరికి కావాలి నీకు డయాబెటిస్ ఉంది.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వెంట్రుకలు ఇస్తానని చెప్పావు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి సవాల్ ని ఇంతవరకు నెరవేర్చలేదు నువ్వు… బాధ్యతగల మంత్రిగా నీ మాట నిలబెట్టుకో అన్నారు అరవింద్.. ఒక ముఖ్యమంత్రి కొడుకా నీ మాటలు గుర్తు పెట్టుకో. జిహెచ్ఎంసి ఎన్నికల గెలుపు తర్వాత హైదరాబాద్ రూపు రేఖలు మారుస్తానని చెప్పావు. ఏం చేశావు?
2020 జిహెచ్ఎంసి ఎన్నికల్లో విచిత్రమైన హామీలు ఇచ్చావు. వరదల్లో మునిగిపోయిన వారికి 10000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు అది ఇవ్వలేదు. రైతు రుణమాఫీ ,నిరుద్యోగలు పెన్షన్, ఉద్యోగాలు ,ఉచిత ఎరువులు ఏ హామీ ఇవ్వలేదు. లవంగాకు తంబాకుకు తేడా తెలియని మంత్రి కేటీఆర్. దర్యాప్తు సంస్థలు, కోర్టులు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి.. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాం లో దోషి అని తెలితే జైలుకు పోతది అన్నారు.
Read Also: Covid Alert: పెరుగుతున్న కోవిడ్ కేసులు.. అలర్ట్ అయిన కేంద్రం
మరో బీజేపీ నేత, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ … తెలంగాణ రాష్ట్ర మంత్రి Ktr కు అసలు సంస్కారం ఉందా? అని ప్రశ్నించారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పై మంత్రి Ktr చేసిన వ్యాఖ్యల పై స్పందించిన డీకే అరుణ, బండి సంజయ్ ktr కు డ్రగ్స్ వ్యవహారం పై సవాలు విసిరి సుమారు ఆరు నెలలు దాటిన తరువాత స్పందించి , తనకు తాను సుద్ధపూసలా మాట్లాడాం సిగ్గుచేటని డీకే అరుణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాలు విసిరినప్పుడు స్పందించని Ktr, దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉందని, ఆయనకు డ్రగ్స్ మత్తు ఇప్పుడు దిగినట్టు ఉందని డీకే అరుణ ధ్వజమెత్తారు.
ఓ రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు ఇలాంటి భాష మాట్లాడితే, ప్రజలకు ఎటువంటి సందేశం పోతుందో మత్తు మనిషి Ktr తెలుసుకోవాలనీ, డీకే అరుణ సూచించారు. నీ ఇష్టం వచ్చినప్పుడు జుట్టు, గోర్లు, రక్తం ఇవ్వడం కాదు, దర్యాప్తు సంస్థలు వారికి కావలసినప్పుడు వాటిని తీసుకుపోతారని, దానికి సమయం ఎంతో దూరంలో లేదని డీకే అరుణ హెచ్చరించారు.
Read Also: Andhra Pradesh: విజయవాడలో ప్రభుత్వం క్రిస్మస్ విందు.. హాజరైన సీఎం జగన్