CM Revanth Reddy: 2034 జూన్ వరకు తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేను కాంగ్రెస్ కార్యకర్తను.. ఏ ఎన్నిక వచ్చిన కోట్లాడత.. నాది లీడర్ మనస్తత్వం కాదు.. క్యాడర్ మనస్తత్వం అన్నారు. డోర్ టు డోర్ కూడా తిరుగుతానని స్పష్టం చేశారు. సెక్యూరిటీ అనుమతి ఇవ్వడం లేదు కానీ.. ఇస్తే ఇల్లు ఇల్లు తిరుగుతానన్నారు. నాకు ఓపిక.. వయసు ఉందని చెప్పారు. అనంతరం సీఎం రేవంత్ బీజేపీ…
MP Arvind Slams Kavitha: జాగృతి అధ్యక్షురాలు కవిత పై ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కవిత నడుస్తోందని ఆరోపించారు. అసలు కవిత ఎవరు..? జాగృతి ఎంటి..? అని ప్రశ్నించారు. కవిత వేధింపుల భయానికి గతంలో కాంట్రాక్టర్లు పారిపోయారన్నారు. జాగృతి జనం బాట యాత్ర తీహార్ జైలుకు వెళ్తుందని.. మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కవిత అనుకున్న ఆశయం నెరవేరుతుందన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కౌంటర్ వేశారు. ‘కారు’ గుర్తు ఉన్న పార్టీ (బీఆర్ఎస్) వాళ్ల పరిస్థితిని వాళ్లే చూసుకోవాలని విమర్శించారు. వాళ్ల కారు ఇప్పటికే రిపేర్ చేయడానికి కూడా పనికి రాకుండా షెడ్డులో పడిందని ఎద్దేవా చేశారు. కనీసం సెకండ్ హ్యాండ్‌లో కూడా కారును కొనడానికి ఎవరూ లేరని బండి విమర్శలు చేశారు. ఈ మేరకు బండి సంజయ్ తన ఎక్స్‌లో పోస్ట్…
పోలవరం కాఫర్ డ్యామ్ రెండోసారి కూలలేదా?.. కాంగ్రెస్, బీజేపీకి పోలవరాన్ని కూలవరం అనే దమ్ముందా? అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాళేశ్వరం విషయంలో ఒక విధానం, పోలవరం విషయంలో మరో విధానమా? అని ప్రశ్నించారు.. పోలవరం కాఫర్ డ్యామ్‌పై ఎన్‌డీఎస్ఏ మౌనం ఎందుకు? అని నిలదీశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.
Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపధ్యంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ఎక్స్ (మునుపటి ట్విట్టర్)లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ బండి సంజయ్, “ట్విట్టర్ టిల్లు.. నువ్వు చేసిన అక్రమాలను మర్చిపోయి లీగల్ నోటీసుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు” అంటూ వ్యాఖ్యానించారు. లీగల్ నోటీసుల వెనక దాక్కుంటూ…
KTR : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై తెలంగాణలో రాజకీయ వేడి మరింతగా పెరుగుతోంది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన బండి సంజయ్‌కు లీగల్ నోటీసు జారీ చేస్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “ఫోన్ ట్యాపింగ్ విషయంలో…
ఇవాళ ఎవరు కొత్త పార్టీ పెట్టినా నమ్మే పరిస్థితి లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీలో కలుపుతున్నారన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కవిత జైల్లో ఉన్నప్పుడు విలీనం కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేయొచ్చన్నారు.. బీజేపీ నుంచి ఎవరూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను కలుస్తానని కవిత అంటోందని.. కవిత కలిసి ఏం చేస్తదని విమర్శించారు. అందులో కొందరు చనిపోయారని.. కొందరు ఇంకెక్కడో ఉన్నారో తెలియదు, మరి కొందరు పార్టీలు…
గతంలో కేటీఆర్ ఆదేశాలతో పోలీసులు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని బెడ్ రూమ్ లోపలికి చొచ్చుకొని వెళ్ళి అరెస్ట్ చేసి జైలుకి పంపారని.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ తనని అరెస్టు చేసిన పోలీసు అధికారులను ఏమి చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. "మేము అధికారంలోకి వచ్చాక రిటైరైన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటాం" అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. పోలీసుశాఖతో పెట్టుకోవద్దు.. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మాటనే…
KTR : తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ అపార్థం చేసుకోవడం దారుణమని, తాము ప్రజా సంక్షేమం కోసం చేసిన ఖర్చును అప్పుగా చిత్రీకరించడం అన్యాయమని మండిపడ్డారు. కేటీఆర్ తన బహిరంగ లేఖలో, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 65 ఏళ్లలో 14 ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేసినా, బీజేపీ ప్రభుత్వం కేవలం…