KTR : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై తెలంగాణలో రాజకీయ వేడి మరింతగా పెరుగుతోంది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన బండి సంజయ్‌కు లీగల్ నోటీసు జారీ చేస్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “ఫోన్ ట్యాపింగ్ విషయంలో బండి సంజయ్ చేసిన ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉందని నిరూపించాలి. కేంద్ర మంత్రిగా ఉండి కూడా నిఘా వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలియదు. కనీస అవగాహన లేకుండా చిల్లర ఆరోపణలు చేయడం ఆయన అలవాటుగా మార్చుకున్నారు,” అని మండిపడ్డారు.
Turaka Kishore: ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన తురకా కిషోర్..
“ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రకటించిన అబద్దాలు అన్ని హద్దులు దాటాయి. బజారు మాటలు మాట్లాడే బానిసపు శైలి ఆయనకు బాగా అలవాటు అయింది. బాధ్యత కలిగిన కేంద్ర మంత్రిగా వ్యవహరించడం అనేది ఢిల్లీ బాస్ చెప్పులు మూసే పని కాదు. బండి సంజయ్ ఇప్పటికైనా ఇది తెలుసుకోవాలి,” అంటూ కేటీఆర్ చురకలంటించారు. కేటీఆర్ ప్రకటనల నేపథ్యంలో బీజేపీ ఎలా స్పందిస్తుందో, బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెబుతారో లేక ఇది కోర్టుల వరకూ వెళుతుందో చూడాలి. తాజా పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి ఉత్కంఠత నెలకొన్నాయి.