రాజకీయ కురువృద్ధులు, బీజేపీ అగ్ర నేతలు ఎల్‌కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషిని ప్రధాని మోడీ కలిశారు. ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు. మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 9న సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మోడీచే ప్రమాణం చేయించనున్నారు.
ఇది కూడా చదవండి: EVM: ‘‘ వాటికి ఇప్పుడు విశ్రాంతినివ్వండి.. వచ్చే ఎన్నికల్లో తిట్టండి’’..ఈవీఎంలను నిందించడంపై సీఈసీ సెటైర్లు..
శుక్రవారం ఎన్డీఏ పక్ష నేతలంతా సమావేశం అయ్యారు. ఎన్డీఏ పక్ష నేతగా మోడీని ఎన్నుకున్నారు. నితీష్ కుమార్, చంద్రబాబు బలపరిచారు. అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు. రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఈ సమావేశానికి ఎన్డీఏ ఎంపీలంతా హాజరయ్యారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే మిత్రపక్షాలతో కలిసి 293 స్థానాలను సొంతం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది
ఇది కూడా చదవండి: Modi Speech: “పవన్ నహి వో తుపాన్ హే” పార్లమెంట్లో ప్రశంసల వర్షం కురిపించిన మోదీ
#WATCH | Delhi | PM Narendra Modi's convoy leaves from the residence of Bharat Ratna and veteran BJP leader LK Advani pic.twitter.com/b2MlqW8jHg
— ANI (@ANI) June 7, 2024
#WATCH | PM Narendra Modi meets veteran BJP leader Murli Manohar Joshi at the latter's residence, in Delhi pic.twitter.com/7yuTbEZB54
— ANI (@ANI) June 7, 2024