ఈనెల 15న విజయవాడలో జరుగనున్న ప్రజా రక్షణ భేరి సభ విజయవంతం కోసం సీపీఎం సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య అధిపత్య పోరు కొనసాగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ సామాజిక సాధికార బస్ యాత్ర చెయ్యడం హాస్యాస్పదం అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ఎస్సీ, ఎస్టీ లకు అన్యాయం చేస్తున్నాయి.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో కోతలు విధించింది అని ఆయన ఆరోపించారు.
Read Also: Samantha: సామ్.. నువ్వెందుకని మార్వెల్ సిరీస్ లో నటించకూడదు
నవంబర్ 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు.. ఆ రోజు విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ వైసీపీ చేస్తుంది.. ఆ అర్హత వైకాపా కు లేదు అని సీపీఎం పొలిటికల్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శలు గుప్పించారు. హక్కులను హరించి రాజ్యాంగానికి తూట్లు పొడిచి రాజ్యాంగానికి గౌరవం ఇచ్చినట్లు నటించడం సరైంది కాదు అని బీవీ రాఘవులు తెలిపారు. అడుగడుగునా బీజేపీ ఎస్సీ, ఎస్టీల హక్కులు హరిస్తుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు మద్దత్తు ఇవ్వడం సరైంది కాదు.. మా రాజకీయ వైఖరి స్పష్టంగా బీజేపీ పార్టీని వ్యతిరేకంచే పార్టీలు శక్తులతో పొత్తు ఉంటుంది అని బీవీ రాఘవులు వెల్లడించారు.