KTR: దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులకు మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించారు. రెజర్ల పట్ల ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్ ఖండించారు. అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశ ప్రజలు రెజర్లను ఆదుకోవాలి. వారిని మనమందరం గౌరవించాలని కేటీఆర్ కోరారు. రెజర్లను ఢిల్లీ పోలీసులు లాగుతూ వుంటే మరో వ్యక్తి ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రెజర్లకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? అంటూ ప్రశ్నించారు. దేశ ఖ్యాతిని చాటిన రేజర్లపై అంత కర్కసం చూపించడం ఏంటని మండిపడ్డారు. రెజర్లకు మద్దతు తెలిపారు. రెజర్లపై నిన్న ఢిల్లీ పోలీసులకు మధ్య తోపులాట చేస్తున్న వీడియోను ట్వీట్ చేశారు.
Can any responsible leader from Govt of India tell us why it has to be this way?
Also Read
These are champions who brought us glory on world stage! They deserve our support and respect #WrestlerProtest https://t.co/fS65wdD21l
— KTR (@KTRBRS) May 28, 2023
ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆదివారం రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. నెల రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ప్రత్యేక బలగాలు కఠినంగా వ్యవహరించాయి. లైంగిక వేధింపులకు పాల్పడిన డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలనే డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడాన్ని నిరసిస్తూ ఆదివారం కొత్త పార్లమెంట్ భవనంలో ‘మహిళా సమ్మాన్ మహాపంచాయత్’ నిర్వహించారు. ఇందులో భాగంగా కొత్త పార్లమెంట్ వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా మరియు ఇతర నిరసనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించారు. రెజ్లర్లపై కేసులు నమోదు చేశారు. నిందితులను ప్రభుత్వం కాపాడుతోందని వినేష్ ఫోగట్ ఆక్షేపించారు.
Hrithik Roshan: గురువు గారు… ఆయన ముందు ఈయన కనిపిస్తాడంటారా?
తాజావార్తలు
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!