Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగిలిపోతుంది. రెండు జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో శాంతిభద్రతలను పరీరక్షించడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలం కావడంతో ఎన్‌పీపీ మద్దతు ఉపసంహరించుకుంది. 60 మంది సభ్యులున్న సభలో ఎన్పీపీ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజారిటీ ఉండటంతో మద్దతు ఉపసంహరణ ప్రభుత్వంపై ప్రభావం చూపించదు. కాగా, మణిపూర్‌లో శనివారం రాత్రి మళ్లీ హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో కుకీలు ఆరుగురి మైటీ వర్గానికి చెందిన వారిని హతమార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసనకారులు ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడి చేశారు. దీంతో పాటు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇంటిపై కూడా దాడికి పాల్పడ్డారు.
Read Also: Bigg Boss 18: ప్రధాని మోడీ మాజీ సెక్యూరిటీ గార్డుకి బిగ్ బాస్‌లో ఆఫర్.. కానీ..
ఇక, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లసౌ దాడి జరగడంతో.. రంగంలోకి దిగిన అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్ సిబ్బంది ఆందోళనకారులను చెదరగొట్టడానికి అనేక రౌండ్లు టియర్ గ్యాస్ షె,ల్లు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. ఇప్పటికే పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపించారు. దీంతో మణిపూర్ సర్కార్ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో నిరవధిక నిషేధం విధించింది. అలాగే, కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.