దేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఆయా చోట్ల జరిగిన బైపోల్స్‌లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు.
మైథిలి ఠాకూర్.. జానపద గాయని. అనూహ్యంగా ఈ ఏడాది రాజకీయ ప్రవేశం చేశారు. అలీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆర్జేడీ అధికారంలో ఉన్న సమయంలో కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. అప్పటి నుంచి బీహార్‌తో అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. ఇక మైథిలి ఠాకూర్‌కు సొంత ప్రాంతంలో కాకుండా అలీనగర్ సీటును బీజేపీ కేటాయించింది.
Jubilee Hills by-election: నేడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. ఇందుకు సంబంధించి ప్రధాన పార్టీలు వారి అభ్యర్థుల ఖరారుపై సన్నాహాలు మరింత దూకుడును పెంచాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ.. అనేక మంది విద్యావంతులు, మేధావులు బీజేపీలో చేరుతున్నారని.. రేపటిలోపు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. అక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తుందా, లేక మజ్లిస్ పోటీ చేస్తుందా అనేది ప్రజలు…
ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నేత పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు.. ఏపీ శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి తమ నామినేషన్ పత్రాలను అందించారు పాకా సత్యనారాయణ..
ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది.. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది.. ఈ నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లు తీసుకుంటారు.. ఇప్పటి వరకు బీజేపీ నుంచి రాజ్యసభకు సంబంధించి నామినేషన్ ఎవరూ వేయలేదు. దీంతో ఏపీ నుంచి ఎవరికీ రాజ్యసభ స్థానం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది... అయితే, కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి రాజ్యసభ స్థానం ఇవ్వడానికి ఒప్పందం జరిగింది.. దీంతో బీజేపీ నుంచి కొన్ని…
దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని మొత్తానికి 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ కైవసం చేసుకుంది. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 47, ఆప్ 23 సీట్లు గెలుచుకున్నాయి. ఇక కేజ్రీవాల్ ఓటమి చెందడం ఆప్ పార్టీకి ఘోర పరాభవంగా చెప్పొచ్చు.
ఢిల్లీలోని 70 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నేడు తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది. కస్తూర్బా నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి నీరజ్ బసోయా విజయం సాధించారు. ఇప్పటివరకు బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా లక్ష్మీనగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ విజయ దుందుబీ మోగించారు..ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ కొండ్లి స్థానం నుంచి విజయం సాధించారు.
దేశంలో మహారాష్ట్ర, జార్ఖండ్‌లో రెండు ప్రధానమైన అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే.. వయనాడ్ ప్రత్యేకంగా ఫోకస్ అవుతోంది. దీనికి ప్రధానంగా.. ఇక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేయడమే కారణం. తొలిసారి ప్రియాంక ఎన్నికల బరిలో నిలబడ్డారు.
బీజేపీకి చెందిన సుందర్ సింగ్ తన్వర్ ఢిల్లీ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ సీటును కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి సుందర్ సింగ్ 115 ఓట్లు గెలుచుకోగా.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాలేదు. ఆప్ అధిష్ఠానం నిర్ణయం మేరకు ఆ పార్టీ కౌన్సిలర్లు ఈ ఎన్నికలను బహిష్కరించారు.
సీఎం సొంత ఇలాఖా లో కాంగ్రెస్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఘన విజయం సాధించారు. 4,500 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ విజయ దుందుభి మోగించారు. సర్వ శక్తులు ఒడ్డీనా వంశీ చంద్ రెడ్డి గెలుపు తీరాలకు చేరలేదు.