రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను విస్మరించిందని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లోని వైఎన్ఆర్ గార్డెన్స్లో భారతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆటో డ్రైవర్లు, లైట్ వెయిట్ మోటార్ వెహికల్ డ్రైవర్లతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ప్రతి నెల జీవన భృతి కల్పిస్తామని చెప్పి మాట తప్పిందని…
అమేథీ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను కేంద్రమంత్రి సమర్పించారు.
ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లాలోని భీమకాళీ ఆలయంలో ఇవాళ (సోమవారం) ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను అమరావతి ఎంపీ, ప్రస్తుత బీజేపీ లోక్‌సభ అభ్యర్థి నవనీత్ కౌర్ దంపతులు కలిశారు. ఫడ్నవిస్ నివాసంలో ఆయనను కలిశారు.
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. సమీప పీఆర్‌టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు.
మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. టీఆర్‌ఎస్ నేత సోము భరత్ కుమార్ ఫిర్యాదుతో ఈసీఐ స్పందించింది. కోమటిరెడ్డి కంపెనీ ఖాతాల నుంచి 5 కోట్ల 24 లక్షల రూపాయలు ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారో వివరాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.