ఢిల్లీలోని 70 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నేడు తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది. కస్తూర్బా నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి నీరజ్ బసోయా విజయం సాధించారు. ఇప్పటివరకు బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా లక్ష్మీనగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ విజయ దుందుబీ మోగించారు..ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ కొండ్లి స్థానం నుంచి విజయం సాధించారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘోర పరాజయం పాలయ్యారు. న్యూఢిల్లీ నుంచి బారిలోకి దిగిన ఆయన బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ చేతిలో ఓటమి చెందారు. ప్రవేశ్ వర్మ దాదాపు మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వాస్తవానికి.. ఇప్పటికే ఈ నేపథ్యంలో అందరి కళ్లు వీఐపీ సీట్లపైనే ఉన్నాయి. న్యూఢిల్లీ సీటు ఢిల్లీ అసెంబ్లీలో అత్యంత హాటెస్ట్ సీటు. ఈ స్థానం ఢిల్లీకి ముఖ్యమంత్రులను ఇస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ కు ముందు, ఈ స్థానాన్ని షీలా దీక్షిత్ ఆక్రమించారు. ఆమె 2013 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ 2013 నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ సారి ఘోర పరాజయం పాలయ్యారు. మొదటి నుంచే అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలోకి దిగారు. ఆయన ప్రభావం ఏం కనిపించడం లేదు.