NTR Family Sentiment:ఇటీవల నటరత్న యన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో యన్టీఆర్ కుటుంబానికే 'ఆగస్టు నెల అచ్చిరాదు' అని కొందరు టముకు వేశారు. యన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన రెండు సార్లు ఆగస్టులోనే బర్తరఫ్ కావడంతో ఈ సెంటిమెంట్ బలంగా ఉందని చెప్పవచ్చు. అయితే చిత్రసీమలో యన్టీఆర్ కు, ఆయన నటవారసులకు కూడా ఆగస్టు నెల అచ్చివచ్చిందనే చెప్పాలి.
M. M. Keeravani: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి బాణీలు ఆయన తమ్ముడు ఎస్.ఎస్.రాజమౌళికి తప్ప ఇతరులకు ఇప్పుడు కలసి రావడం లేదు అనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే తన దరికి చేరిన ప్రతీ చిత్రాన్ని తొలి సినిమాగా భావించి బాణీలు కడుతూ ఉంటారు కీరవాణి. ఎవరు ఏమనుకున్నా, నందమూరి ఫ్యామిలీలో తండ్రులకు, కొడుకులకు అచ్చివచ్చిన సంగీత దర్శకునిగా కీరవాణి నిలచిపోయారు. తాజాగా కళ్యాణ్ రామ్ 'బింబిసార'కు మ్యూజిక్ అందించారు కీరవాణి.
Kalyan Ram: శుక్రవారం విడుదలై విజయపథంలో సాగిపోతున్న 'బింబిసార' చిత్రం గురించి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేశారు. ఇంతకాలంగా తనకు దన్నుగా నిలిచి ప్రేమను అందించిన చిత్రసీమకు చెందిన స్నేహితులకు, మీడియాకు, శ్రేయోభిలాషులకు, సినీ ప్రేమికులకు, నందమూరి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. 'బింబిసార'కు ఇవాళ లభించిన విజయం యావత్ సినిమా రంగానికి చెందిన విజయంగా కళ్యాణ్ రామ్ అభివర్ణించారు. ఈ సందేశంలో కళ్యాణ్ రామ్ 'బింబిసార' చిత్ర ప్రయాణం గురించి తలుచుకున్నారు.…
Chiranjeevi congratulated bimbisara and sitaramam movie team. Chiranjeevi, Bimbisara, Sitaramam, Breaking News, Movie News, Kalyan Ram, Dulquer Salmaan
Bimbisara: ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ హీరోగా ఇంతవరకూ ఎనిమిది చిత్రాలు నిర్మించాడు. కానీ ఏ ఒక్క సినిమానూ స్టార్ డైరెక్టర్ తో అతను నిర్మించలేదు. ఆరేళ్ళ క్రితం 'ఇజం' సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసినా అప్పుడు పూరి పరాజయాల్లో ఉన్నాడు. విశేషం ఏమంటే... ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో తొలి చిత్రం 'అతనొక్కడే' ను కొత్త దర్శకుడు సురేందర్ రెడ్డితో తీశాడు కళ్యాణ్ రామ్.
Bimbisara Success Press Meet: ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ హీరోగా హరికృష్ణ నిర్మించిన 'బింబిసార' చిత్ర బృందం క్లౌడ్ నైన్ లో ఉంది. తొలి ఆట నుండే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడంతో పలు కేంద్రాలలో థియేటర్లను పెంచుతున్నారు. మార్నింగ్ షో రిపోర్ట్ అందుకున్న వెంటనే చిత్ర బృందం నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో కళ్యాణ్ రామ్ ఈ చిత్ర విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.