Hero Adivi Sesh About Bimbisara and sitaramam movie
నందమూరి కళ్యాణ్ రామ్ హీరో నటించిన సినిమా బింబిసార నిన్న విడులైన విషయం తెలిసిందే. అయితే .. ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. దీంతో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన సీతారామం సినిమా సైతం హిట్ కొట్టడంతో ఆ చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగింది. ఈ సినిమాలో హీరో సుమంత్ ఓ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ రెండు సినిమాలపై సినీ ప్రముఖులు ప్రశంసలతో పాటు చిత్ర యూనిట్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తాజాగా అడవి శేష్ స్పందిస్తూ.. బింబిసార, సీతారామ బాగున్నాయంటూ బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోందని, ఇండస్ట్రీకి ఇది కదా కావాల్సింది అని ఆయన అన్నారు.
అంతేకాకుండా.. ఈ సినిమాలు హిట్ కావడం సంతోషం ఉందని, కానీ.. తనకు కరోనా వచ్చిన కారణంగా ఈ సినిమాలను చూడలేకపోతున్నానన్నారు. ప్రస్తుతుం వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్‌లో ఉన్నానని, కరోనా నుంచి కోలుకున్నాక ఈ సినిమాలను ఎంజాయ్ చేస్తానన్నారు. ఇదిలా ఉంటే.. అడవి శేష్‌కు కరోనా సోకినట్లు తెలియడంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.