బైక్ స్టంట్ చేసేవారు వివిధ రకాలుగా బైక్స్‌ను నడుపుతుంటారు. బైక్‌పై నిలబడి, పడుకొని, ముందు చక్రాన్ని ఎత్తి, లేదా వెనుక చక్రాన్ని గాల్లో నిలబెట్టి బైక్ నడుపుతూ స్టంట్ చేస్తుంటారు. బైక్ పై ఎన్ని విన్యాసాలు చేసినా రివర్స్‌లో నడపడం అంటే చాలా కష్టమైన పని అని చెప్పాలి. కానీ, ఆ కష్టమైన దాన్ని ఓ వ్యక్తి ఇష్టంగా చేసి చూపించాడు. తన తెలివికి పదునుపెట్టి స్కూటీకి రెండు వైపులా హ్యాండిల్ ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అంటే ట్రైన్‌కు రెండు వైపులా ఇంజన్లు ఉన్నట్టుగా. ఇప్పుడు ఎటు కావాలంటే అటు నుంచి డ్రైవింగ్ చేసకుకోవచ్చు. చూసే వాళ్లకు కొత్తగా, వింతగా అనిపిస్తుంది. దీనికి సంబందించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నది.
Read: డిసెంబర్ నుంచి వంటనూనె ధరలు తగ్గనున్నాయా…?