ఒక బండిపై ఇద్దరు ప్రయాణం చేయవచ్చు. అంతకంటే ఎక్కువ మంది ప్రయాణం చేస్తే ఫైన్ విధిస్తారు. అయితే, ఓ వ్యక్తి తన బండిపై ముగ్గురు నలుగురు కాదు ఏకంగా 13 మందిని ఎక్కించుకొని ప్రయాణం చేస్తున్నారు. ఒక బండిపై 13 మందిని ఎలా ఎక్కించుకున్నారు అన్నది ఆశ్చర్యంగా మారింది. ఆటో కూడా కాదు టూ వీలర్. అంతమందిని బండిమీద బ్యాలెన్స్ చేయడం అంటే మాములు విషయం కాదు. చివరకు ముందు చక్రంపై కూడా పిల్లలను కూర్చోపెట్టుకొని పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. అయితే, ఇలా సదరాకోసం చేశారా లేదంటే ఎదైనా ఫీట్ కోసం చేశారో తెలియదుగాని, దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా పిల్లలకు తీవ్రగాయలవుతాయని, ఇలాంటి ఫీట్లు చేసేటప్పుడు ఆలోచించాలని అంటున్నారు.
Read: అర్థరాత్రి హైడ్రామా… షర్మిల దీక్ష భగ్నం…