ఇప్పటివరకు హైదరాబాద్ శివార్లకు పరిమితమైన బైక్ రేసింగ్ కల్చర్ ఇప్పుడు సీటీ నడిబొడ్డుకు పాకింది. నిత్యం రద్దీగా వుండే రోడ్లపై, రాత్రి సమయాల్లో వీధుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ హైదరాబాద్ యువత రేసింగ్ లకు పాల్పడుతున్నారు. రాత్రి సమయాలలో పాల్పడే బైక్ రేసింగ్లు కోవిడ్ వల్ల అర్ధరాత్రి నైట్ కర్ఫ్యూ విధించడం తో ఆదివారం సాయంత్రం సమయంలో బైక్ రేసింగ్ కి పాల్పడుతున్నారు రేసర్లు. అతి వేగంగా రోడ్ల పై 30 నుండి 40 వాహనాలతో రేస్ లకు పాల్పడి స్టాంట్ లో చేస్తూ రోడ్ల పై వాహనదారులకు ఇబ్బంది పెడుతున్నారు రైడర్ లు. అధిక వేగంతో బైక్లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. నిత్యం రద్దీగా వుండే చంచల్ గూడ జైల్ రోడ్డు లో కొనసాగుతున్న యువకుల బైక్ స్టంట్స్ అందరిని హదలెత్తిస్తుంది. దీని పై పోలీసులు స్పందించి వీరి పై కఠిన చర్యలు తీసుకివాలని ప్రజలు కోరుతున్నారు.