కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాప్టర్ లోపం వల్ల ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో హెలికాప్టర్ కొద్ది సేపటికే నియంత్రణ కోల్పోయింది. ఈ ఘటన బీహార్ లోని బెగుసరాయ్ లో సోమవారం చోటుచేసుకుంది. బెగుసరాయ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీకి హాజరైన అమిత్ షా ప్రచారాన్ని ముగించుకుని హెలికాప్టర్‌లో బయలుదేరారు. అయితే., టేకాఫ్ కాగానే విమానం అదుపు తప్పి కుడివైపుకు మళ్లింది. ఒక క్షణం అతను దాదాపు నేలను తాకబోయాడు.
Also Read: ATM Blast: ఏటీఎంలో చోరీకి ప్రయత్నం.. షార్ట్ సర్క్యూట్ దెబ్బకి..
దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే హెలికాప్టర్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. దాంతో ఆ తర్వాత నిర్ణిత మార్గంలో వెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ నెట్‌వర్క్ లలో ట్రెండ్ అవుతున్నాయి. గత వారం, ప్రతికూల వాతావరణం కారణంగా అమిత్ షా హెలికాప్టర్ ల్యాండ్ కాలేదన్నా విష్యం తెలిసిందే. ఏప్రిల్ 21న కేంద్ర మంత్రి పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ ల్యాండ్ కాలేకపోయింది అక్కడ. దీంతో ఆయన పర్యటన రద్దు చేసుకోని వెను తిరిగారు.