పెళ్లంటే ఎంతో హడవిడి ఉంటుంది. అనుకున్న సమయానికి పెళ్లి జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం పెళ్లి ఏర్పాట్లు చకాచకా కానిస్తారు. కానీ.. ఇక్కడ ఓ వింత ఘటన జరిగింది. వరుడు మద్యం తాగి ఆలస్యంగా వచ్చాడని వధువు వివాహాన్ని రద్దు చేసింది. ఈ ఘటన బీహార్‌లోని కటిహార్‌లో జరిగింది. అంతేకాకుండా.. పెళ్లి ఏర్పాట్ల కోసం ఖర్చైన రూ. 4 లక్షలు ఇవ్వాలని వరుడు తల్లిదండ్రులను డిమాండ్ చేసింది.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం బిజెపి పై తీవ్రంగా ఆరోపించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని నాశనం చేయాలని అధికార పార్టీ కోరుకుంటోందని ఆరోపించారు. ‘బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్’ రూపొందించిన రాజ్యాంగాన్ని బీజేపీ నాశనం చేయాలనుకుంటోంది. భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం క్షీణించడానికి మేము అనుమతించము అని సారన్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ లాలూ అన్నారు. Also read: T20 World Cup 2024: మెగా…
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాప్టర్ లోపం వల్ల ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో హెలికాప్టర్ కొద్ది సేపటికే నియంత్రణ కోల్పోయింది. ఈ ఘటన బీహార్ లోని బెగుసరాయ్ లో సోమవారం చోటుచేసుకుంది. బెగుసరాయ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీకి హాజరైన అమిత్ షా ప్రచారాన్ని ముగించుకుని హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే., టేకాఫ్ కాగానే విమానం అదుపు తప్పి కుడివైపుకు మళ్లింది. ఒక క్షణం అతను దాదాపు నేలను తాకబోయాడు. Also Read: ATM Blast:…
పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న చిన్నారులను రెస్క్యూ ఆపరేషన్ చేసి ఉత్తరప్రదేశ్ చైల్డ్ కమిషన్ రక్షించింది. 95 మంది చిన్నారులను అధికారులు రక్షించారు. బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా చాకచక్యంగా చిన్నారులను కాపాడారు.
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా.. ఈరోజు 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో ఓటేసేందుకు యువతీ, యవకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మరోవైపు.. ఈ ఎన్నికల్లో వృద్ధ ఓటర్లు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. 106 ఏళ్ల బామ్మ ఓటేసి ఆదర్శంగా నిలిచారు. బీహార్ రాష్ట్రం బరారిలో 106 వృద్ధురాలు ఓటేసి అందరి కళ్లు తన వైపు చూసేలా చేసింది.…
స్కూల్ బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు చిన్నారులకు గాయాలైన ఘటన బీహార్ లోని సరన్ జిల్లాలో జరిగింది. బనియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దధిబాధి గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ వ్యాన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో సుమారు అర డజను మంది పిల్లలు మంటల్లో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన అక్కడి స్థానికులు.. పిల్లలందరినీ బస్సులో నుంచి క్షేమంగా కిందకు దించారు. గాయాలైన పిల్లలను వెంటనే బనియాపూర్ రిఫరల్ ఆసుపత్రిలో…
Fire Accident : బీహార్‌లోని వైశాలిలోని బిదుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవనగర్ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ఇంట్లో ఉన్న సభ్యులు తీవ్రంగా కాలిపోయారు.
Jammu Kashmir: సార్వత్రిక ఎన్నికల వేళ టెర్రరిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్లో టార్గెటెడ్ కిల్లింగ్‌కి పాల్పడ్డాడు. బీహార్ నుంచి వచ్చిన వలస కూలీని లక్ష్యంగా చేసుకుని హతమార్చారు. ఈ ఘటన అనంత్ నాగ్ జిల్లాలో చోటు చేసుకుంది. బీహార్‌కి చెందిన వలసకూలిని చంపినట్లుగా బుధవారం అధికారులు తెలిపారు. మృతుడిని రాజు షాగా గుర్తించారు.