Tragedy: నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృతి..
- బీహార్‌లో తీవ్ర విషాదం
- నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృతి
- సోన్ నదిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. సోన్ నదిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు మునిగిపోయారు. వారిలో ఐదుగురు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు పిల్లల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. ప్రమాద ఘటనపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన ఇద్దరు పిల్లల ఆచూకీ లభించకపోవడంతో SDRF బృందం రంగంలోకి దిగింది.
Read Also: Heart attack-Exercise: అలర్ట్.. అధిక వ్యాయామంతో గుండెపోటు..!
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
రోహ్తాస్ గ్రామం కేదార్ గౌర్‌కు చెందిన కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు సోన్ నదిలో స్నానానికి వెళ్లారు. వీరంతా.. ఎనిమిది నుండి పన్నెండేళ్ల మధ్య వయస్సు గలవారు. అయితే స్నానానికి నదిలోకి దిగిన వారు లోతు ఎక్కువగా ఉండటంతో ఓ చిన్నారి నీటిలో మునిగిపోయాడు. అతడిని కాపాడే క్రమంలో మిగతా వారందరూ నీట మునిగి చనిపోయారు. వారు మునిగిపోతున్న సమయంలో రక్షించమని కోరారు. అయితే.. స్థానికులు అక్కడికి చేరుకునే లోపే నది ప్రవాహానికి కొట్టుకుపోయారు. అక్కడున్న బోటు డైవర్ల బృందం వారిని గుర్తించి ఐదుగురు పిల్లలను బయటకు తీశారు. కానీ, అప్పటికి చాలా ఆలస్యం అయింది. ఐదుగురు చనిపోయారు.
Read Also: Tata Share: సంచలనం సృష్టించిన టాటా షేర్.. లక్ష పెట్టుబడి పెడితే.. రూ. 7.5 కోట్లు అయ్యింది!
ఈ ప్రమాద ఘటనపై డెహ్రీ ఎస్‌డిఎం సూర్య ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. నీటి మట్టం ఎక్కువగా ఉండడంతో చిన్నారులు నీట మునిగి చనిపోయారని తెలిపారు. వారిలో ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారని.. ఇద్దరి కోసం అన్వేషణ కొనసాగుతోందన్నారు. మునిగిపోయిన ఏడుగురిలో ఇద్దరు బాలికలు ఉన్నారని పేర్కొన్నారు.
- Tags
- Bath
- bihar
- died
- River
- Seven children
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..