Bihar: కీలకమైన బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ-జేడీయూ కూటమికి, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి కీలక పోరు నెలకొంది. అయితే, ఇప్పుడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో నెలకొన్న వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల హామీల కన్నా బీహార్ ప్రజలు లాలూ కుటుంబంలో ఏం జరుగుతుందో అనే ఆసక్తిని కనబరుస్తున్నారు. లాలూ ప్రసాద్ కూతురు రోహిణి ఆచార్య, కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు మరో కొడుకు తేజస్వీ యాదవ్‌తో పొసగ
ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా ఇండియా కూటమి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదని ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తేల్చి చెప్పారు. ఒక జాతీయ మీడియాకు తేజస్వి యాదవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
అధికార పార్టీకి వత్తాసుగా కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లు చోరీ చేస్తుందంటూ కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. తాజాగా మరోసారి శుక్రవారం ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. ‘‘ఉదయం 4 గంటలకు నిద్రలేవండి.. 37 సెకన్లలో ఇద్దరు ఓటర్లను తొలగించండి. ఆపై తిరిగి నిద్రపోండి.’’ అని ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి రాహుల్‌గాంధీ పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. కాంగ్రెస్ చొరబాటుదారులను కాపాడుతోందని తిప్పికొట్టారు. బీహార్‌లోని డెహ్రీలో షహాబాద్, మగధ్ ప్రాంతాలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇంకోవైపు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌పై తీవ్ర కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది. మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించేలా ఈసీ ప్లాన్ చేస్తోంది. ఇ
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్, ఆర్జేడీల ‘‘మహాఘటబంధన్’’ కూటమిలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీట్ల పంపకాల్లో ప్రతిష్టంభన నెలకొంది. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు తేజస్వీ యాదవ్, రాబోయే ఎన్నికల్లో 243 అసెంబ్లీస స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.
Voter roll revision: అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణ ప్రారంభం కానున్నట్లు ఎలక్షన్ కమీషన్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశంలో దీనిపై చర్చించారు, ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికలు ముగిసే లోపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రకటన రావచ్చు. కాన్ఫనెన్స్ కమ్ వర్క్ షాప్ సందర్భంగా ఓటర్ జాబితా సవరణకు ఎంత త్వరగా సిద్ధంగా ఉండొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అడిగినట్లు…
బీహార్‌లో ఎన్నికల వార్ నడుస్తోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నేతలు మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. ఇక నవంబర్ కల్లా బీహార్ ఎన్నికలు ముగించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాక ముందే నేతలంతా మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. రాజకీయాల్లో విమర్శలు-ప్రతి విమర్శలు సహజమే. కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి రాద్ధాంతం చేస్తున్నారు.
SIR: ఇటీవల బీహార్ రాష్ట్రంలో కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అమలు చేయడం సంచలనంగా మారింది. అక్రమ ఓటర్ల గుర్తించి, ఎన్నికల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తోంది. అయితే, ఈ ప్రక్రియను ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ-ఈసీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.